Viral Video: తైవాన్ మెట్రోలో స్టేషన్ మాస్టర్ పిల్లి నియామకం, సో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్.

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 03:21 PM IST

పిల్లులను  (Meet ‘Mikon’)చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు. ఈ ట్రెండ్ విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాటికి రకరకాల పేర్లను పెట్టి పిలుస్తుంటారు. అయితే తైవాన్ లో మాత్రం ఓ పిల్లిని ఏకంగా స్టేషన్ మాస్టర్ చేసేశారు. అవును, మికాన్ పిల్లిని స్టేషన్ మాస్టర్ గా నియమించారు. Kaohsiung మాస్ రాపిడ్ ట్రాన్సిట్, దాని 15వ వార్షికోత్సవంతోపాటు బాలల దినోత్సవం సందర్భంగా, పిల్లికి స్టేషన్ మాస్టర్‌గా పదోన్నతి కల్పించారు. Kaohsiung మెట్రోస్టేషన్ అత్యంత రద్దీగా ఉంటుంది. వేగవంతమైన రవాణా వ్యవస్థ దాని సేవలతో మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది.దాని నెట్‌వర్క్‌లో 37 స్టేషన్‌లను కలిగి ఉంది.

Mikan అత్యంత ప్రజాదరణ పొందిన పిల్లిగా ఫేమస్ అయ్యింది. సెలబ్రిటీ హోదాను పొందే స్థాయికి ఎదిగింది. మికాన్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో 57,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మికాన్ యొక్క సోషల్ మీడియా ఖాతాలో స్టేషన్ మాస్టర్ పిల్లికి సంబంధించిన రోజువారి చిత్రాలను షేర్ చేస్తున్నారు. పిల్లి ప్రమోషన్‌కు సంబంధించిన పోస్ట్ కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారు. ట్విట్టర్‌లో, వినియోగదారులు నాలుగు కాళ్ల స్టేషన్ మాస్టర్ చిత్రాలతో పోస్ట్‌కు ప్రతిస్పందించడం ప్రారంభించారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పిల్లిని పొగిడేస్తున్నారు “సూ క్యూట్” ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “అతను చాలా శ్రద్ధగలవాడు!”అంటూ మరో నెటిజన్ కామెంట్ జోడించాడు.

ఇక స్టేషన్ మాస్టర్ పిల్లిని నియమించడం ఇదే తొలిసారి కాదు. మికాన్‌తో పాటు, తమ ఉపాధి స్థితి గురించి గొప్పగా చెప్పుకునే ఇతర పిల్లులు కూడా ఉన్నాయి. జార్జ్ ఇంగ్లాండ్‌లోని స్టౌర్‌బ్రిడ్జ్ జంక్షన్ రైలు స్టేషన్‌లో “సీనియర్ మౌస్ క్యాచర్” , జపాన్‌లోని కినోకావాలోని కిషిగావా లైన్‌లోని కిషి స్టేషన్‌లో, టామా అనే ఆడ కాలికో పిల్లిని స్టేషన్ మాస్టర్, ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు.