Site icon HashtagU Telugu

Isha Arora: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పోలింగ్ అధికారి.. ఎవరీ ఇషా అరోరా..?

Isha Arora

Isha Arora

Isha Arora: దేశంలోని 102 లోక్‌సభ స్థానాలకు తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి దశ ఓటింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింస, మరికొన్ని చోట్ల ఎన్నికలను బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఓ పోలింగ్ అధికారి వార్తల్లో నిలిచారు. ఈ అందమైన అధికారి పేరు ఇషా అరోరా (Isha Arora). ఆమె ఎన్నికల డ్యూటీ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

సహరన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని గంగో అసెంబ్లీలోని మహరి గ్రామంలోని పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారిగా ఇషా అరోరా బాధ్యతలు స్వీకరించారు. ఇషా లక్నోలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్ పోస్ట్‌లో ఉన్నారు. గతంలో కూడా ఆమె రెండు సార్లు ఎన్నికల విధులు నిర్వర్తించారు. అయితే, గత లోక్ సభ ఎన్నికల్లో కరీనా ద్వివేదిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన విష‌యం తెలిసిందే. పసుపు చీరలో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న రీనా ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

We’re now on WhatsAppClick to Join

సహరాన్‌పూర్ పోలింగ్ అధికారి ఇషా ఈవీఎంను తీసుకుని పోలింగ్ పార్టీతో బూత్ నుండి బయలుదేరిన చిత్రం, వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన వెంటనే వైరల్ కావడం ప్రారంభించింది. ఇషా అరోరా గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా చూడటం ప్రారంభించారు. ఆమె పోలింగ్ సామగ్రిని సేకరించేందుకు చేరుకున్నప్పుడు, ఇతర పోలింగ్ అధికారులు కూడా ఆమెతో పాటు ఫోటోలు తీయడం కనిపించింది. ఇషా గ్లామరస్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది.

అదే సమయంలో ప్రజాస్వామ్యం గొప్ప పండుగలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఓటర్లందరికీ ఇషా విజ్ఞప్తి చేయడం కనిపించింది. ఇషా అరోరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. ఆమె సహరన్‌పూర్ నివాసి. రెండోసారి ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలక్షన్ పనిని ఉత్తమంగా నిర్వహించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Health Insurance Purchase: గుడ్ న్యూస్.. ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు