Site icon HashtagU Telugu

Janasena Scarves: జనసేన కండువాలతో దండలు మార్చుకున్నపెళ్లి జంట.. వీడియో వైరల్

Janasena Scarves

Compressjpeg.online 1280x720 Image (3)

Janasena Scarves: పెళ్లి అనేది జీవితంలో ఒక కీలకాంశం. దీంతో చాలా ప్రత్యేకంగా జరుపుకోవాలని అందరికీ ఉంటుంది. ఎవరి స్థాయిని బట్టి వారు తమ వివాహాన్ని జరుపుకుంటారు. అలాగే ఒక జంట కూడా తమ వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా దానిని అమల్లో పెట్టేసింది. ఈ జంట పెళ్లి ఫోటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ జంట ఏం చేసిందో.. ఎందుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక జంట వారి పెళ్లి వేడుకల్లో ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకు తెరలేపారు. వీరి వివాహం ఎప్పుడు జరిగిందో కరెక్ట్ గా తెలియదు. కానీ వారికి సంబంధించిన పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకు వారు ఏం చేశారంటే.. పెళ్లిలో చాలామంది పెళ్లి దండలు వేసుకుంటారు.

Also Read: Aiswrya Lakshmi : క్యూట్ ఫోజులతో మతి పొగౌడుతున్న ఐశ్వర్య లక్ష్మి

వాటితో పాటు ఇతర ఏవైనా దండలు ఉంటే వేసుకుంటారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాల (Janasena Scarves)ను ఒకరికొకరు మెడలో వేసుకున్నారు. అంతేకాకుండా పవన్ మ్యానరిజమ్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వీరికి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానామో లేదంటే ఇష్టమో తెలియదు కానీ వధూవరులు ఇద్దరు జనసేన కండువాలు వేసుకునే వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారారు. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.