Plane Villa : విమానాన్ని విల్లాలా మార్చేశాడు.. వీడియో వైరల్

Plane Villa : మనదేశంలోని అపర కుబేరుల్లో ఒకరు ఆనంద్‌ మహీంద్రా.  ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ వీడియోలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని ప్రైవేట్‌ లగ్జరీ విల్లాగా(Plane Villa)  ఓ వ్యక్తి మార్చేయడాన్ని ఆ వీడియోలో చూపించారు. వినూత్నంగా ఆలోచించి విమానాన్ని […]

Published By: HashtagU Telugu Desk
Plane Villa

Plane Villa

Plane Villa : మనదేశంలోని అపర కుబేరుల్లో ఒకరు ఆనంద్‌ మహీంద్రా.  ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ వీడియోలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని ప్రైవేట్‌ లగ్జరీ విల్లాగా(Plane Villa)  ఓ వ్యక్తి మార్చేయడాన్ని ఆ వీడియోలో చూపించారు. వినూత్నంగా ఆలోచించి విమానాన్ని విల్లాగా మార్చిన యువకుడిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యాకు చెందిన ఫెలిక్స్‌ డెమిన్‌ అనే యువకుడు పాత బోయింగ్‌ 737 విమానాన్ని కొనేసి సముద్రపు ఒడ్డున ఉన్న తన స్థలంలో పార్క్ చేసి విలాసవంతమైన విల్లాగా మార్చేశాడు. అందులో రెండు బెడ్ రూమ్స్, స్విమ్మింగ్‌ పూల్‌, విలాసవంతమైన హోటల్‌ను రెడీ చేసుకున్నాడు. విమానంలోని  కాక్‌పిట్‌ భాగాన్ని బాత్‌రూమ్‌లా ఛేంజ్ చేయించాడు. ఇలా విమానంలో ప్రతి స్థలాన్ని తనకు నచ్చినట్లుగా అందంగా మార్చుకున్నాడు. ఫెలిక్స్‌ డెమిన్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోను  ఆనంద్‌ మహీంద్రా తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు.

Also Read : Beauty Tips: మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ పువ్వులను ఉపయోగించాల్సిందే?

‘‘సమాజంలో కొద్దిమందే కలల్ని సాకారం చేసుకొనే లక్కును కలిగి ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం తన కలలపై ఎలాంటి పరిమితులు విధించినట్లు కనిపించలేదు. ఆ విల్లాలో బస చేయాలనే ఆసక్తి కలుగుతుందో లేదో వేచి చూడాలి’’ అని మహీంద్రా ఈ పోస్టులో రాసుకొచ్చారు. మహీంద్రా షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 53 లక్షల మందికిపైగా వీక్షించారు. ఫెలిక్స్‌ డెమిన్‌ క్రియేటివిటీ అదుర్స్ అంటూ నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఇలాంటి క్రియేటివిటీ ఉన్నవాళ్లకు ప్రభుత్వాలు అండగా నిలిస్తే టూరిజం మరింత డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.

Also Read : Kejriwal: లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఒంటరిగానే పోటీ చేస్తాం: కేజ్రీవాల్ 

  Last Updated: 18 Feb 2024, 07:28 PM IST