Site icon HashtagU Telugu

Rajasthan : భార్య కోసం..మేనల్లుడిని బలి ఇచ్చిన వ్యక్తి

Man Sacrifices Nephew For W

Man Sacrifices Nephew For W

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా సారాయ్ కలాన్ గ్రామంలో ఘోరమైన సంఘటన వెలుగు చూసింది. తన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు క్షుద్ర పూజకు తెగబడిన వ్యక్తి, మేనల్లుడైన ఆరేళ్ల బాలుడిని బలిగా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. బాలుడిని మాయ చేసి, గొంతు కోసి, సిరంజిలతో రక్తాన్ని తీయడం వంటి విచిత్రమైన పద్దతుల పట్ల ప్రజలు శోకానికి లోనవుతున్నారు. ఈ అమానవీయ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

జులై 19న మాయ చేసి తీసుకెళ్లిన లోకేష్ అనే బాలుడిని, అతని మామ మనోజ్ కుమార్ నిర్మానుష్య భవనంలో దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య వెనుక ఉన్న కారణాలు పోలీసుల విచారణలో ఒక్కొటిగా బయటపడినవి. తాంత్రికుడు సునీల్ కుమార్ సూచనలతో ఈ హత్య జరిగినట్లు తెలిసింది. తాంత్రికుడు, మంత్ర పటాలు, బలిచేసే శరీర భాగాలు అవసరం అంటూ 12 వేల రూపాయలు తీసుకుని, బాలుడి కాలేయం, రక్తాన్ని పూజ కోసం వినియోగించాలంటూ సూచించినట్లు మనోజ్ అంగీకరించాడు.

Daggubati Rana: రానాకు మరోసారి ఈడీ నోటీసులు.. ఆగ‌స్టు 11న డెడ్ లైన్‌!

హత్య అనంతరం మృతదేహాన్ని గడ్డి, కలపతో నిండి ఉన్న గదిలో దాచి, కాలేయం తర్వాత తీయాలని భావించాడు. ఈ క్రూర చర్యలన్నింటిని గమనించిన పోలీసులు, సీసీటీవీ ఆధారంగా మనోజ్‌ను అనుమానించి, విచారించగా నిజాలను ఒప్పుకున్నాడు. మానవత్వాన్ని మరిచిపోయి, సొంత మేనల్లుడినే బలి ఇవ్వగలిగిన మనోజ్‌పై తీవ్ర అసహ్యం వ్యక్తమవుతోంది. అదేరోజు రాత్రికి లోకేష్ మృతదేహం గుర్తించి, కేసు నమోదు చేసిన పోలీసులు, సునీల్‌ను కూడా రెండు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలంలో నుండి సిరంజిలు, ఇతర సాక్ష్యాలు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్‌ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. క్షుద్రపూజలు, మూఢనమ్మకాల పేరుతో జరిగిన ఈ అమానవీయ ఘటన మరోసారి మన దేశంలో ఇంకా మూఢవిశ్వాసాల ముదురుతున్న వాస్తవాన్ని వెలికితీసింది.

Exit mobile version