Site icon HashtagU Telugu

Ordered Lens-Received Seeds : కెమెరా లెన్స్ ఆర్డర్ చేస్తే.. ఆ విత్తనాలు వచ్చాయి

Ordered Lens Received Seeds

Ordered Lens Received Seeds

Ordered Lens-Received Seeds : అతడు అమెజాన్ లో ఆర్డర్ చేసింది ఒకటి.. కానీ ఆర్డర్ లో వచ్చింది మరొకటి !

దీంతో ఆర్డర్ ప్యాక్ ను ఓపెన్ చేసి చూసిన అతడు షాక్ కు గురయ్యాడు.   

రూ.90,000 విలువైన కెమెరా లెన్స్‌ను అతడు ఆర్డర్ చేస్తే.. అమెజాన్ డెలివరీ చేసిన ప్యాకేజీలో క్వినోవా విత్తనాలు వచ్చాయి..

అరుణ్ కుమార్ మెహెర్ అనే వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. అతడు  జూలై 5న అమెజాన్ నుంచి “సిగ్మా 24-70 ఎఫ్ 2.8 లెన్స్‌” ని ఆర్డర్ చేశాడు. మరుసటి రోజే డెలివరీ ప్యాకేజీని అందుకున్నఅతడు.. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. ఆ బాక్స్ లో కెమెరా లెన్స్‌కు బదులుగా క్వినోవా విత్తనాలు కనిపించాయి. దీంతో ఎంతో బాధపడ్డ అరుణ్ కుమార్.. “ఇది ‘పెద్ద స్కామ్” అని పేర్కొంటూ ట్వీట్(Ordered Lens-Received Seeds) చేశాడు. ” వెంటనే నా సమస్యను పరిష్కరించండి” అంటూ అమెజాన్ కు ఫిర్యాదు చేశాడు. “నేను ఆర్డర్ చేసిన లెన్స్‌ని నాకు పంపండి. లేదంటే నా డబ్బును నాకు తిరిగి చెల్లించండి” అని కోరాడు.

అమెజాన్ స్పందన ఇదీ.. 

ఈ ఫిర్యాదుపై అమెజాన్ స్పందిస్తూ.. ”మీరు కలత చెందారని మేము భావిస్తున్నాము. మేము దీనిలో మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. దయచేసి DM ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మేము సహాయం చేయడానికి మా వంతు కృషి చేస్తాము. దయచేసి మీ ఆర్డర్/ఖాతా వివరాలను DM ద్వారా అందించవద్దు. ఎందుకంటే మేము వాటిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తాము” అని బదులిచ్చింది. అయితే ఫాస్ట్ గా తన సమస్యను పరిష్కరించాలని అమెజాన్ ను అరుణ్ కోరాడు. మరోవైపు తాను రూ. 50,900 యాపిల్ వాచ్‌ కోసం ఆర్డర్ చేస్తే దానికి  బదులుగా నకిలీ చేతి గడియారం వచ్చిందని మరో కస్టమర్ అమెజాన్‌ కు  ఫిర్యాదు చేశాడు.