Site icon HashtagU Telugu

Suicide Attempt: మెట్రో పట్టాలపైకి దూకి జంట ఆత్మహత్యాయత్నం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే?

Suicide Attempt

Suicide Attempt

ఇటీవల వల కాలంలో ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, హత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా జంట ఆత్మహత్యలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. భార్యాభర్తలు వారి వ్యక్తిగత కారణాల కారణంగా చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుని మరణించిన ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక జంట మెట్రో స్టేషన్ లో అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది వారిని రక్షించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్ కతా మెట్రో నార్త్ సౌత్ లైన్ లో కరెక్ట్ గా మెట్రో రైలు వచ్చే సమయానికి ఒక వ్యక్తి తన భార్యను ఎత్తుకొని ఆ రైలు పట్టాల పైకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది వెంటనే గమనించిన మెట్రో సిబ్బంది ఆ భార్యాభర్తలిద్దరిని క్షేమంగా కాపాడారు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ జంట చేసిన పనికి కొద్దిసేపు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది.

 

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియో పై స్పందించిన నెటిజన్స్ ఇకపై మెట్రో సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.