Site icon HashtagU Telugu

Rajasthan: పెళ్లి కావాల్సిన యువతని కిడ్నాప్ చేసిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే?

Rajasthan

Rajasthan

తాజాగా రాజస్థాన్లో ఒక సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కావాల్సిన యువతిని ఒక యువకుడు బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఎత్తుకొని ఏడడుగులు వేసి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లయిపోయింది అంటూ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ లోని జైసల్మీర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని పుష్పేంద్ర సింగ్ అనే ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తనతో పెళ్లి ఆగిపోయింది అన్న కోపంతో ఇలా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముందుగా ఉపేంద్రకు ఆ యువతితో పెళ్లి నిశ్చయం కాగా కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది. ఇక ఈనెల 12వ తేదీన సదరు యువతకి మరొక యువకుడితో పెళ్లి నిశ్చయించారు కుటుంబ సభ్యులు. ఆ విషయం తెలుసుకున్న పుష్పేంద్ర సింగ్ కొంతమంది యువకులు బంధువులతో కలిసి యువతి ఇంటి పై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒక ప్రదేశంలో గడ్డికి నిప్పు పెట్టి దాని చుట్టూ యువతిని ఎత్తుకొని ఏడడుగులు వేసి ప్రదక్షిణలు చేశాడు. హిందూ ఆచారం ప్రకారం తమ ఇద్దరికీ పెళ్లి జరిగిందని నిందితుడు తెలిపాడు.

 

ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు మహిళలు రక్షించి పుష్పెంద్రను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెపి కూడా రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆ యువకుడిని కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్టు చేయాలని బాధిత యువతి కుటుంబీకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.