Karnataka: భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధం

కర్ణాటకలోని మైసూర్ జిల్లా హిరేగే గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధంలో ఉంచాడు.

Karnataka: కర్ణాటకలోని మైసూర్ జిల్లా హిరేగే గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధంలో ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి బాధితురాలు సుమను రక్షించడంతో పాటు నిందితుడు సన్నలయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి సుమ మూడో భార్య అని విచారణలో తేలింది.

నిందితుడికి సుమ మూడో భార్య అని విచారణలో తేలింది. పెళ్లయిన రోజు నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన మొదటి వారంలోనే ఆమెను తన ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. తలుపుకు మూడు తాళాలు వేసి ఎవరితోనూ మాట్లాడవద్దని భార్యను హెచ్చరించాడు. ఇంటి బయట ఉన్న టాయిలెట్‌ని ఉపయోగించకూడదని నిషేధించాడు. దీని కోసం గది లోపల ఒక బకెట్ ఉంచాడు మరియు దానిని స్వయంగా అతనే బయట పారవేసేవాడు. బాధితురాలి బంధువు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలు సుమ మాట్లాడుతూ.. నా భర్త నన్ను గదిలో బంధించాడని, పిల్లలతో బహిరంగంగా మాట్లాడనివ్వడం లేదని తెలిపింది. కారణం లేకుండా నన్ను పదే పదే తిట్టేవాడు. ఊరిలో అందరూ అతడిని చూసి భయపడుతున్నారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చే వరకు నా పిల్లలను నాతో ఉండనివ్వలేదు. నేను ఒక చిన్న కిటికీ ద్వారా వారికి ఆహారం ఇవ్వవలసి వచ్చింది. ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Uttar Pradesh: తాను చనిపోతూ 40 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్