Great Lover: ఇది కదా నిజమైన ప్రేమ అంటే.. ప్రియురాలి కోసం 21 గంటల పాటు మోకాళ్లపై తపస్సు?

సాధారణంగా ప్రేమించిన ప్రియురాలు కోసం త్యాగాలు చేయడం ఫైట్లు చేయడం ఎదుటి వ్యక్తులను కొట్టడం లాంటి

Published By: HashtagU Telugu Desk
Great Lover

Great Lover

సాధారణంగా ప్రేమించిన ప్రియురాలు కోసం త్యాగాలు చేయడం ఫైట్లు చేయడం ఎదుటి వ్యక్తులను కొట్టడం లాంటి హీరోలు స్టంట్ లు ఎక్కువగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో కూడా ఇప్పటికే ఇలాంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక ప్రేమికుడు తన ప్రియురాల కోసం ఒకటి రెండు కాదు ఏకంగా 21 గంటలపాటు మోకాళ్లపై అలాగే కూర్చున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది.

ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలి కోసం అమీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి తిరిగి రావాలని వేడుకున్నాడు. గులాబీ పూలు పట్టుకుని తన మాజీ ప్రియురాలు మనసు మార్చుకునే వరకు వేచి చూశాడు. ఇంతలోనే స్థానికులు పెద్ద ఎత్తున అతను చుట్టూ గుమిగూడి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరినా కూడా ఆ ప్రియుడు అందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలోనే వర్షం కురవడంతో చలి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అప్పటికి ఆ ప్రేమికుడు తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు..

అలాగే వర్షం పడుతున్న చలి పెడుతున్న తన ప్రియురాలు కోసం దాదాపుగా 21 ఒక గంటలపాటు మోకాళ్లపైనే కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడికి మీడియా అలాగే పోలీసులు కూడా చేరుకున్నారు. ఆమెతో మాట్లాడి స్నేహితురాలు కనిపించడానికి కూడా ఇష్టపడడం లేదని అతనికి తెలిపారు. అప్పటికి అతడు తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పి ప్రయత్నించినా కూడా అతను ఎవరి మాట వినలేదు. మోకాళ్ళపై కూర్చుని పోలీసులకు సమాధానం చెబుతూ కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలు విడిపోయిందని, అతను ఆమెని క్షమాపణలు కోరుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అతను మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 1:00 నుండి మరుసటి రోజు ఉదయం 10:00 వరకు 21 గంటల పాటు దాజౌ లోని ఎంట్రన్స్ గేటు ఎదుట మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు చలిని భరించలేక మార్చి 29 ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..

  Last Updated: 05 Apr 2023, 04:21 PM IST