Site icon HashtagU Telugu

Viral News: కామం హద్దులు దాటితే కుక్కలను కూడా వదలట్లేదు

Viral News

Viral News

Viral News: కామం హద్దులు దాటితే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టిస్తుంది. శృంగారానికి మనిషితో సంబంధం లేకుండా పోతుంది. కామంతో నిండిన వాడు పశువును కూడా వదలడం లేదు. కామం తలకెక్కడంతో పరిసరాల్లో ఉండే కుక్కలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో మనిషి కామానికి పశువులు బలవుతున్నాయి.

ముంబైలో కుక్కపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై 43 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కోపర్ ఖైరానే పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 మరియు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద సంజయ్ కదమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం హౌసింగ్ సొసైటీ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిందితుడు కుక్కను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. దీంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన పోలీసులు నిందితుడిపేట పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు.

Also Read: Thummala Counter to KCR : అసలు కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించిందే నేను – తుమ్మల రియాక్షన్