Site icon HashtagU Telugu

Sunflower Sarming: 50వ పెళ్లిరోజు కానుకగా 12 లక్షల ప్రొద్దుతిరుగుడు పువ్వులను బహుమతిగా ఇచ్చిన భర్త ?

Sunflower Sarming

Sunflower Sarming

మామూలుగా భార్యాభర్తలు పెళ్లిరోజు జరుపుకున్నప్పుడు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం అన్నది కామన్. భాగస్వామి కోసం రకరకాల గిఫ్ట్ లు ఇచ్చి సర్ప్రైస్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా మాత్రం ఒక వ్యక్తి తన భార్యకు వారి 50వ పెళ్లిరోజు సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలిస్తే పెళ్లయి 50 ఏళ్ళు అయినా తను తన భార్యని అంతలా ప్రేమిస్తున్నాడా అన్న అనుమానం రాకమానదు. అతను పెళ్ళి రోజు కానుకగా ఏమి ఇచ్చాడో తెలుసా? అమెరికన్ రైతు లీ విల్సన్ తన భార్య రెనీ కోసం చేసిన పని అసాధారణమైనది.

లీ విల్సన్ తన భార్య రెనీకి తన 50వ వివాహ వార్షికోత్సవంలో కనులవిందుగా నిలిచే బహుమతిగా పొద్దుతిరుగుడు పువ్వులను పెంచాడు. అతడు పెంచింది ఇంట్లో కాదు దాదాపు 80 ఎకరాల భూమిలో ఈ పువ్వులను పెంచాడు. వాటి ద్వారా వచ్చిన సంఖ్య 12లక్షలకు పైగా ఉంటుంది. తన భార్య పొద్దుతిరుగుడు పువ్వులను ఎంతగా ప్రేమిస్తుందో లీకి బాగా తెలుసు. రెనీకి పొద్దుతిరుగుడు పువ్వుల గుత్తిని ఇవ్వడానికి బదులుగా అతను మొత్తం తోటను బహుమతిగా ఇచ్చాడు. లీ తన కొడుకు సహాయంతో మేలో పువ్వులు నాటాడు. వారి వార్షికోత్సవం వరకు తన భార్య నుండి తోట విషయాన్ని రహస్యంగా ఉంచాడు.

పొద్దుతిరుగుడు పువ్వులు పూర్తిగా వికసించినప్పుడు ఆమె ఇష్టమైన ప్రకాశవంతమైన పసుపు పొద్దుతిరుగుడు పువ్వులతో అలంకరించబడిన విశాలమైన పొలాల ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూడటానికి ఆమెను ఆహ్వానించడం ద్వారా అతను తన భార్యను ఆశ్చర్యపరుస్తాడు. లీ తనకు అలాంటి ఆశ్చర్యకరమైన ఆలోచన ఎలా వచ్చిందో చెప్పాడు. అయితే 50 ఏళ్ల నుంచి నా భార్య నేను కలిసి ఉంటున్నాము. అందుకే ఈ సంబరాలు చేసుకుంటున్నాను. ఆమె ఎప్పుడూ పొద్దుతిరుగుడు పువ్వులను ఇష్టపడుతుంది కాబట్టి నేను వాటిని 80 ఎకరాలలో పెంచానని తెలిపాడు లీ. గిఫ్ట్ ని చూసి లీ భార్య రెనీ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నేను పొద్దుతిరుగుడు పొలం కంటే గొప్ప వార్షికోత్సవ బహుమతిని అడగలేను అని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చింది.

Exit mobile version