Treadmill – Heart Attack : జిమ్ చేస్తుండగా గుండెపోటు వస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ పోతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో 21 ఏండ్ల యువకుడు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలాడు. అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. గుండెపోటుతోనే ఆ యువకుడు చనిపోయాడని తెలిపారు. చనిపోయిన యువకుడు.. నోయిడాలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని తెలిసింది. అతడు తల్లితండ్రులకు ఒక్కడే కొడుకు. దీంతో తమ కుమారుడి డెడ్ బాడీని చూసుకొని పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఖోదా తానా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి విహార్‌లో ఈ యువకుడి ఫ్యామిలీ నివసిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారానికి మూడు రోజులు జిమ్ చేస్తే చాలని.. మితిమీరిన స్థాయిలో జిమ్ చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాయామ నిపుణుల సలహాలు తీసుకొని జిమ్ లో వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. మధ్యలో విరామం తీసుకుంటూ జిమ్ చేయాలని కోరుతున్నారు.
Treadmill – Heart Attack : ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్.. గుండెపోటుతో యువకుడి మృతి

Treadmill Heart Attack