Man arrested : ఎలుకను అతి క్రూరంగా చంపిన వ్యక్తి జైలుపాలు ..

ఓ వ్యక్తి రోడ్ ఫై ఉన్న ఎలుక ను అతి క్రూరంగా చంపి జైలుపాలయ్యాడు

Published By: HashtagU Telugu Desk
Man Arrested In Noida For C

Man Arrested In Noida For C

కొంతమంది మూగ జీవాల పట్ల అతి క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. మూగ జీవాలు (Dumbest Animals)కనిపిస్తే చాలు వాటిపై దాడి చేసి రాక్షస ఆనందం పొందుతుంటారు. అందుకే ఇలాంటి వారికీ కఠిన శిక్షలు విధించాలని జంతు ప్రేమికులు కోరుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి (Matloob Ahmed Son) రోడ్ ఫై ఉన్న ఎలుక(Rat) ను అతి క్రూరంగా చంపి జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీ శివారులోని నొయిడా లో చోటుచేసుకుంది.

నొయిడాలోని ‘ఖాన్ బిర్యానీ’ సెంటర్ యజమాని మతాలుబ్ అహ్మద్ (Matloob Ahmed Son) కుమారుడు జైనులుద్దీన్‌..రోడ్ ఫై ఉన్న ఎలుక (Rat) పైకి పదే పదే తన బైక్ ఎక్కించి, అత్యంత దారుణంగా ఆ ఎలుకను నలిపి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిని చూసిన జంతు ప్రేమికులు సదరు వ్యక్తి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అతడికి శిక్ష వేయాలని పెద్ద ఎత్తున కోరారు. దీనిని ఫై పోలీసులు కేసు నమోదు చేసి ..సదరు వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న జైనులుద్దీన్‌..యూపీలోని అతడి స్వగ్రామం మాముర కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: No Rain Village : ఆ గ్రామంలో వర్షం అనేది పడదట..

  Last Updated: 25 Jul 2023, 03:14 PM IST