Anand Mahindra: వామ్మో.. సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఫుట్ బాల్ స్టేడియం.. ఫొటోస్ వైరల్?

సాధారణంగా మనం ఫుట్‌బాల్‌ స్టేడియంని చూసే ఉంటాం. డైరెక్ట్ గా కాబోయే కాకపోయినా టీవీలలో లేదంటే మొబైల్

  • Written By:
  • Publish Date - April 24, 2023 / 06:06 PM IST

సాధారణంగా మనం ఫుట్‌బాల్‌ స్టేడియంని చూసే ఉంటాం. డైరెక్ట్ గా కాబోయే కాకపోయినా టీవీలలో లేదంటే మొబైల్ ఫోన్లో అయినా చూసి ఉంటాం. అయితే మామూలుగా ఫుట్‌బాల్‌ స్టేడియం కూడా ఇంచుమించుగా క్రికెట్ స్టేడియంలోనే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మాములుగా ఈ స్టేడియంలో చుట్టూ కాస్త ఎత్తుగా ఉంది ఈ మధ్యలో ఈ స్టేడియం నిర్మిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫుట్‌బాల్‌ స్టేడియం ఫోటోస్ చూస్తే అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని వెయ్యి,రెండువేలు కాదు ఏకంగా 11 వేల అడుగుల ఎత్తున నిర్మించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఉంటారు. అలాగే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుతాలను ట్విటర్‌ ఖాతాద్వారా కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్‌బాల్‌ స్టేడియం ఫొటోలను పంచుకున్నారు.

అలాగే అక్కడ మ్యాచ్ చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఆ ఫుట్ బాల్ స్టేడియం కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌ లో సముద్ర మట్టానికి దాదాపుగా 11వేల అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్‌ స్టేడియయాన్ని నిర్మించారు.కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మొదటి పది స్టేడియాల్లో ఇదీ కూడా ఒకటి. ఒకేసారి ఆ స్టేడియంలో ఏకంగా 30 వేల మంది కూర్చొని ఆటను చూడవచ్చు.

ఆ స్టేడియం కి సంబంధించిన ఫోటోలను స్టేడియం చిత్రాలను ఒక మీడియా సంస్థ షేర్ చేసింది. అవి కాస్త ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్నాయి. వెంటనే ఆయన వాటిని రీట్వీట్ చేస్తూ.. ఆ దృశ్యాలను కళ్లు విప్పార్చి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఇక్కడికి వస్తాను. టీవీలో క్రికెట్ చూడటానికి బదులు ఒక ఆదివారం ఇక్కడ ఫుట్‌ బాల్‌ మ్యాచ్ చూస్తా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.