Narhari Zirwal Jumps From Third Floor: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ (Narhari Zirwal) మూడవ అంతస్తు నుండి దూకడం సర్వత్రా ఆందోళన నెలకొంది. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌తో సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కూడా దూకారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ స్పీకర్, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ మంత్రాలయ భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకారు. షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వేషన్ కోటాలో ధన్‌నగర్ కమ్యూనిటీని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ భవనానికి సేఫ్టీ జాలి ఏర్పాటు చేసి ఉండటంతో వాళ్లంతా ప్రాణాలతో బయటపడ్డారు.
#Maharastra #Politics #Mumbai #Mantralaya
Adivasi MLAs protesting on protective net in Manatralaya.
They are protesting against Dhangar community getting reservation in ST category. pic.twitter.com/KzpkAMLLdc— Mayuresh Ganapatye (@mayuganapatye) October 4, 2024
నరహరి జిర్వాల్ మూడు అంతస్తుల నుంచి జంప్ చేసిన తర్వాత వాళ్ళని భద్రతా వలయాల నుండి రక్షించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌తో సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కూడా దూకారు. వాళ్ళని సెక్యూరిటీ సిబ్బంది భద్రతా వలయం నుంచి కాపాడుతున్న విజువల్స్ గుగుర్పాటుకు గురి చేస్తున్నాయి. అధికారులు వాళ్ళందరిని సురక్షితంగా బయటకు తీశారు.
Also Read: Cricketer Turned Boxer: బాక్సర్‌గా మారిన యువరాజ్ సింగ్ ప్రత్యర్థి..!