ఇటీవల బీర్ బాటిల్స్‌లో కప్పలు, బిర్యానీల్లో బొద్దింకలు కనిపించిన సంఘటనలు కలకలం రేపగా.. తాజాగా సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో ఓ హోటల్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హోటల్‌లో థమ్స్ అప్ (Thumbs Up) తాగిన కొందరు యువకులకు బాటిల్‌లో బల్లి కాలు (Lizard leg) కనిపించడంతో షాక్ అయ్యారు. కాస్త ముందే గమనించి తప్పించుకున్నా, అప్పటికే ఓ యువకుడు కొంత తాగి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Ginger Tea: వేసవికాలంలో అల్లం టీ తాగవచ్చా తాగుకూడదా? తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఈ ఘటనపై బాధితులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారితో తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం యువకులు ఈ విషయం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల వాంగ్మూలాన్ని తీసుకున్న అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బహిరంగంగా అమ్ముతున్న కూల్ డ్రింక్స్ పై మరింత గమనించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇటువంటి ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నిపుణులు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ప్రజలను హెచ్చరిస్తున్నారు. హోటల్స్‌లో తినే ఆహారపదార్థాలు, తాగే పదార్థాలను ముందుగా ఒకసారి పరిశీలించుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్యం మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఘటనలు జరుగుతున్న ఈ కాలంలో సరదాగా తీసుకునే కూల్ డ్రింక్స్ కూడా ప్రమాదంగా మారుతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.