హైదరాబాద్‌లో పెరిగిపోతున్న మైనర్లు ‘సహజీవనం’ కల్చర్

హైదరాబాద్‌లో వెలుగులోకీ వచ్చిన ఇద్దరు మైనర్లు సహజీవనం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 16 ఏళ్ల యువతీ , యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో ఉన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది

Published By: HashtagU Telugu Desk
Live In Relationship Hyd

Live In Relationship Hyd

గతంలో విదేశాల్లో కొనసాగిన ‘సహజీవనం’ కల్చర్ ..ఇప్పుడు హైదరాబాద్ లో పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్లకు అలవాటై చాలామంది యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మైనర్లు తన వయసును పట్టించుకోకుండా ‘సహజీవనం’ కల్చర్ కు అలవాటైపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకీ వచ్చిన ఇద్దరు మైనర్లు సహజీవనం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 16 ఏళ్ల యువతీ , యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో ఉన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో.. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఇద్దరిని పెద్దలు మందలించి, మేజర్ వయసు వచ్చాక ఇద్దరికీ పెళ్లి చేస్తామని , ఈ లోపు మీరు ఉన్నంత చదువులు చదువుకొని , మంచి జాబ్ చేయాలనీ షరతులు పెట్టారు. ఈ షరతులకు ఇద్దరు ఒప్పుకున్నారు.

Live In Relationship

ఆ తర్వాత అబ్బాయి పాల్వంచలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరాడు. అమ్మాయి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కుట్టు మిషన్ శిక్షణ తీసుకుంటోంది. ఇక్కడే ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఈ క్రమంలో ప్రియురాలిని కలవకుండా ఉండలేకపోయిన అబ్బాయి.. తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో ఉంటున్న అమ్మాయి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ డిసెంబర్ 31 రాత్రి కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో అబ్బాయి కనిపించకపోయే సరికి.. వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు పరుగులు తీశారు. అనంతరం అమ్మాయి అద్దెకు ఉంటున్న ఇంటి వచ్చే సరికి.. ఇద్దరూ ఒకే గదిలో కనిపించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అబ్బాయి మైనర్‌ కావడంతో పోలీసులు అతడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. ఇక అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

  Last Updated: 05 Jan 2026, 11:43 AM IST