Society : రోడ్డు మీద బతికే మమ్మల్ని బతకనివ్వండి..?

ఇటీవల సోషల్ మీడియా ఎంతగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికలతో డబ్బులు వస్తుండడం తో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడం..ప్రతి ఒక్కటీ పోస్ట్ చేసి వైరల్ చేయడం చేస్తున్నారు. అయితే కొంతమంది చేసే అతి వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత పది రోజులుగా కుమారి ఆంటీ ని సోషల్ మీడియా చానెల్స్ వారు ఎంత ఫేమస్ చేసారో చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఫేమస్ చేసారో..అంతే […]

Published By: HashtagU Telugu Desk
Let Us Live On The Road

Let Us Live On The Road

ఇటీవల సోషల్ మీడియా ఎంతగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికలతో డబ్బులు వస్తుండడం తో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడం..ప్రతి ఒక్కటీ పోస్ట్ చేసి వైరల్ చేయడం చేస్తున్నారు. అయితే కొంతమంది చేసే అతి వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత పది రోజులుగా కుమారి ఆంటీ ని సోషల్ మీడియా చానెల్స్ వారు ఎంత ఫేమస్ చేసారో చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఫేమస్ చేసారో..అంతే విధంగా ఆమెను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆమెనే కాదు ఆమె హోటల్ పక్కన ఉన్న హోటల్స్ ను , షాప్ వారిని ఇలా రోడ్ల ఫై షాప్స్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరి పొట్టకొడుతున్నారు. తమ వ్యూస్ కోసం ఇలా రోడ్డు ఫై బ్రతికే వారి జీవన ఉపాధిని కోల్పోయేలా చేయడం ఎంతవరకు కరెక్ట్..? ఇది వారు అంటున్న మాట కాదు..ఈ వీడియోస్ చూస్తూ..పలువురు యూట్యూబ్ చానెల్స్ చేసే అతిని చూసిన వారు అంటున్న మాటలు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రోడ్డు ఫై హోటల్ నడిపించే నిర్వాహకురాలు..యూట్యూబ్ చానెల్స్ ను కడిగి పారేసింది. ఎందుకమ్మా మా దగ్గరి కి మా ప్రాణాలు తీస్తారు..దేశంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి..అత్యాచారాలు జరుగుతున్నాయి..మహిళలకు రక్షణ లేకుండా పోయింది..చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారు..ఎన్నో సమస్యలు ఉన్నాయి..వాటిని చూపించకుండా..వాటిని హైలైట్ చేయకుండా..చికెన్ బాగుందని , చింతకాయ పచ్చడి బాగుందని వీటినా మీరు కవర్ చేసేదని మీడియా ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమె అన్న మాటలకూ అంత సపోర్ట్ చేస్తున్నారు..ఇలా అడగాలి అప్పుడు కానీ బుద్ది రాదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Pawan : సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా..? – పవన్

  Last Updated: 05 Feb 2024, 12:06 AM IST