Viral Video : రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి..?

దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తోన్నప్పుడు, రిజిస్టర్‌లో సంతకం చేస్తోన్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో ఈ జంతువు తిరుగాడటం వీడియోల్లో రికార్డయింది

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 03:01 PM IST

రాష్ట్రపతి భవన్‌లోకి చిరుత పులి (Leopard ) ప్రవేశించినట్లు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అది కూడా నిన్న ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసే టైం లో..దేశ రాజధాని ఢిల్లీ లో ఉన్న రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan) ఎంతో ప్రత్యేకమని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భవనంలో 340 గదులు, మూడు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిని 90 ఏళ్ల క్రితం ఎడ్విన్ లుటియన్స్ నిర్మించగా, ఈ భవనంలో కీలక కార్యక్రమాలు, విందులు జరుగుతాయి. రాష్ట్రపతి భవన్‌లో అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు ఎన్నో జరుగుతాయి. నిత్యం పటిష్టమైన భద్రత ఉంటుంది. అలాంటి ఈ చోట చిరుత పులి సంచరించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా నిన్న ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో.

నిన్న ఆదివారం NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ప్రధాని మోడీతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే , నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. మొత్తం 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా- మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రపతి భవన్‌లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేస్తోన్నప్పుడు, రిజిస్టర్‌లో సంతకం చేస్తోన్న సమయంలో సరిగ్గా ఆయన వెనుక రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో ఈ జంతువు తిరుగాడటం వీడియోల్లో రికార్డయింది. ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిరుతలను కూడా రాష్ట్రపతి భవన్‌లో పెంచుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది అవి చిరుతలు కాదని అంటుండగా, ఇంకొంత మంది మాత్రం అవి చిరుతలేనని కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మంత్రం ఏది ఎవరో ఎడిట్ చేసి పోస్ట్ చేసారని అంటున్నారు. లేకపోతే అంత భారీ భద్రత ఉన్న రాష్ట్రపతి భవన్ లోకి చిరుత ఎలా ప్రవేశిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది.

Read Also : TSRTC : బస్సు ఎప్పుడు వస్తుందని అడిగినందుకు ప్రయాణికుడి పై డ్రైవర్ దాడి