Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన కొండముచ్చు కోతులు.. వీడియో వైరల్?

మామూలుగా సింహాలు, చిరుత పులులు లాంటి క్రూర జంతువులు అడవిలో దొరికిన ఇతర జంతువులను వేటాడి చంపి మరి తింటూ ఉంటాయి. పొరపాటున

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 04:45 PM IST

మామూలుగా సింహాలు, చిరుత పులులు లాంటి క్రూర జంతువులు అడవిలో దొరికిన ఇతర జంతువులను వేటాడి చంపి మరి తింటూ ఉంటాయి. పొరపాటున ఏదైనా జంతువు ఒంటరిగా ఈ క్రూర మృగాల కంట పడింది అంటే దాని చావు తథ్యం. కొన్ని కొన్ని సార్లు చిరుత,సింహాలు గుంపుగా జంతువులను కూడా వేటాడుతూ ఉంటాయి. గుంపుగా ఉన్న సమయంలో చాలా తక్కువ మాత్రమే ఆ జంతువులను చంపి తింటూ ఉంటాయి. అందుకే ఒంటరిగా ఉంటే సింహం అయినా కూడా సైలెంట్ అయిపోవాల్సిందే అని అంటూ ఉంటారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాలో రద్దీగా ఉండే రహదారి పైకి పదుల సంఖ్యలో కొండముచ్చులు గుంపులు గుంపులుగా వచ్చి కూర్చొన్నాయి. మరోవైపు వాహనాలు వాటిని దాటుకుంటూ నెమ్మదిగా రోడ్డు పై వెళ్తున్నాయి. ఇంతలో సరిగ్గా అదే సమయంలో ఒక చిరుత అటువైపుగా వచ్చింది. కొండముచ్చులే కదా అని తేలిగ్గా తీసుకున్న చిరుత కొండముచ్చుల వైపు దూసుకొచ్చింది. ఇంతలో ఒకవైపు ఉన్న ఒక కొండముచ్చు పైకి దాడి చేసేందుకు రెడీ అయ్యి ఒక ఊదుటన దూకింది.

అంతే ఒక్కసారిగా మేమంతా ఉన్నాం అంటూ కొండముచ్చుల గ్యాంగ్‌ అంతా ఒకేసారి చిరతపై దాడి చేశాయి. దెబ్బకి హడలిపోయిన చిరుత అక్కడ నుంచి జారుకునేందుకు యత్నించింది. అయినా ఆ కొండముచ్చులు విడువకుండా దాన్ని తరుముకొడుతూ వెళ్లాయి. కలిసి ఉంటే ఎంతపెద్ద కష్టన్నైనా జయించవచ్చు అని నిరూపించాయి ఆ కొండముచ్చులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోని చూసి నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.