Leech Found In Nose: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.19 ఏళ్ల యువకుడి ముక్కు నుంచి సజీవ జలగను వైద్యులు తొలగించారు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన కేసు అని చెప్పారు డాక్టర్లు. 19 రోజుల పాటు ఆ యువకుడి నోట్లో జలగ ఉండిపోయి రక్తం పీలుస్తూనే ఉందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో యువకుడి ముక్కు నుంచి శ్లేష్మం బయటకు రాకుంటే ప్రాణం పోయేదని వైద్యులు కూడా చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్ నివాసి అయిన సెసిల్ ఆండ్రూ గోమ్స్‌కు జూన్ 4 నుంచి ముక్కులో ఎదో సమస్యగా అనిపించింది. ముక్కులో నొప్పి వచ్చి రక్తం కారడం, సిసిల్‌కి మొదట్లో మామూలుగా అనిపించినా సమస్య ఎక్కువ కావడంతో కంగారుపడి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
నగరంలోని ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ సుభాష్‌చంద్ర వర్మ పరీక్షించగా.. సిసిల్‌కు ఎలాంటి వ్యాధి లేదని, అయితే అతని ముక్కులో జలగ ఉందని తేలింది. డాక్టర్ వెంటనే అతనికి శస్త్రచికిత్స చేయాలని చెప్పాడు. జూన్ 24న ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్ర వర్మ ఎండోస్కోపీ ద్వారా జలగను బయటకు తీశారు. డాక్టర్ వర్మ మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో ఇదొక అరుదైన ఘటనగా పేర్కొన్నారు. భారత్‌లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.
జూన్ 4న ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లినట్లు సెసిల్ ఆండ్రూ గోమ్స్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని భలుగడ్ నదిలో గంటల పాటు స్నానం చేసి స్నేహితులతో సరదాగా గడిపారు. జూన్ 8న ఇంటికి తిరిగి వచ్చేసరికి ముక్కు నుంచి స్వల్పంగా రక్తం కారుతోంది. అతను దానిని సాధారణమని భావించాడు. తర్వాత మెల్లగా తుమ్మడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు అతనికి తలనొప్పి కూడా మొదలైంది. అశాంతి పెరగడం మొదలైంది. వైద్యుడిని సంప్రదించి అతని లక్షణాలను వివరించాడు. డాక్టర్ కొన్ని మందులు రాశారు. టాబ్లెట్స్ వాడినా సమస్త అలాగ ఉంది.దీంతో నగరంలోని నజరేత్ ఆసుపత్రిలో ఈఎన్ టీ సర్జన్ డాక్టర్ సుభాష్ చంద్ర వర్మను సిసిల్ సంప్రదించారు. డాక్టర్‌కి విషయం మొత్తం చెప్పాడు. అతని ముక్కులో జలగ కనిపించడం డాక్టర్ గమనించాడు. డాక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెసిల్‌ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఎండోస్కోపీ ద్వారా జలగను తొలగించడంలో సఫలమయ్యారు. జలగ తన బరువు కంటే 8-9 రెట్లు ఎక్కువగా రక్తాన్ని తాగగలదని డాక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. మంచి విషయమేమిటంటే జలగ శ్వాసనాళంలో లేదా ఆహార గొట్టంలో ఇరుక్కుపోయి ఉంటే యువకుడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడి ఉండేది.
Also Read: Hyderabad: 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం