Site icon HashtagU Telugu

Uttar Pradesh: కోతుల కోసం ఎలుగుబంట్లుగా మారిన రైతన్నలు.. అసలేం జరిగిందంటే?

Uttar Pradesh

Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లోని లిఖింపూర్ లో కోతుల కోసం రైతులు వినూత్నంగా ఆలోచించారు. కోతులు దాటికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జంతువులు విచ్చలవిడిగా తిరుగుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కోతులు చెరుకు రైతులను తీవ్ర అవస్థల పాలు చేస్తున్నాయి. దీంతో రైతులు చెరుకు పంటను కోతుల నుంచి కాపాడుకోవడం కోసం ఒక మార్గాన్ని కనుగొన్నారు. అక్కడి రైతులే స్వయంగా ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేశారు.

ఆ ఎలుగుబంటి వేశధారణతో భయపెట్టి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారికి అది తప్ప మరొక మార్గం లేదు అని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని లిఖింపూర్ ఖేరిలోని జహాన్ నగర్ గ్రామంలో రైతులు ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న కోతులను తరిమికొట్టడం కోసం రైతులు ఎలుగుబంటి దుస్తులను కొనుగోలు చేసి ఎలుగుబంటి వేషధారణతో పొలాల్లో కూర్చుంటున్నారు. అయితే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పంటలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చేసేదేమీ లేక కొత్తగా ఆలోచించి తామే అలాంటి ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. అయితే అలా ఎలుగుబంటి వేషాల్లో పొలాల్లో కూర్చున్న వారికి కాపలాగా ఉండే వారికి 250 రూపాయలు కూలీ కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.