West Bengal: ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తు

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 03:11 PM IST

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. కాగా మొన్నటికి మొన్న మెట్రో స్టేషన్ లో ఒక జంట ట్రైన్ వస్తుండగా దాని కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వారిని కాపాడిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఆ జంట ప్రాణాలను కాపాడారు. ఇది ఇలా ఉంటే తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడడం కోసం మహిళా కానిస్టేబుల్ సాహసం చేసింది.

అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ లోని పూర్వ మేదినిపుర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పూర్వ మేదినిపుర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఒక వైపు నుంచి రైలు రావడాన్ని గమనించిన అతను చుట్టూ ఒకసారి గమనించి వెంటనే ప్లాట్‌ఫాం దిగి పట్టాలపై పడుకున్నాడు. ఈ క్రమంలోనే పక్క ప్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కె.సుమతి అతన్ని గమనించి వెంటనే అప్రమత్తమయింది.

 

వెంటనే ఫ్లాట్ఫారం మీద నుంచి పట్టాల పైకి దూకి అతన్ని పట్టాలపై నుంచి వెనక్కి లాగారు. ఆమె అతన్ని అలా పక్కకు లాగిన వెంటనే ట్రైన్ దూసుకు వచ్చింది. అలా రెప్పపాటి కాలంలోనే అతడి ప్రాణాలను కాపాడడం కోసం ఆ మహిళా కానిస్టేబుల్ సాహసం చేసింది. రైలు అక్కడికి చేరుకునే క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. అది గమనించిన మరో ఇద్దరు ప్రయాణికులు పరుగున వచ్చి ఆ మహిళ కానిస్టేబుల్ కి సహాయం చేసి అతడిని రక్షించి ప్లాట్ ఫారం పైకి చేర్చారు. అయితే రైలు స్పీడుతో దూసుకొస్తున్న కూడా ఏమాత్రం భయం లేకుండా అతడి ప్రాణాలను రక్షించడానికి ఆమె చేసిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.