తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా హల్చల్ చేస్తూ వస్తున్న మహిళా అఘోరి (Naga Sadhu)..ఇప్పుడు తన మకాంను ఏపీకి మార్చింది. తెలంగాణలో ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చిన ఈమె ..ఇప్పుడు ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హల్చల్ చేస్తుంది. దీంతో మీడియా లో కాకుండా సోషల్ మీడియా లోను ఈమె గురించి చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు ఈమె ఒళ్లంతా విభూది పూసుకుని నుదిటన పెద్ద సైజులో కుంకుమ బొట్టుతో దర్శనమిచ్చింది. మెడలో రుద్రాక్ష దండలతో.. చేతులకు రుద్రాక్షలు కట్టుకుని పెదాలకు లిప్ స్టిక్ రాసుకుని కనిపిస్తూ వచ్చింది. కానీ నిన్న శ్రీ కాళహస్తి పరమశివుడి ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. ఆమెను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె గుడిలోకి వెళ్లనివ్వకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని క్యాన్ లో ఉన్న పెట్రోల్ ను తనమీద కుమ్మరించుకుని రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే లేడీ అఘోరీ అసలు రూపం లీక్ అయ్యింది. తొలిసారి లేడీ అఘోరీ అసలు రూపం (Lady Aghori Naga Sadhu Real Face) చూసి జనాలు బిత్తరపోయారు. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడున్న వారు ఆమెను కాపాడేందుకు నీళ్లు కుమ్మరించారు. దీంతో లేడీ అఘోరీ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. సాధారణ రూపంలో కనిపించే సరికి జనాలు అవాక్కయ్యారు. వామ్మో ఇలా ఉందంటే..అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఇక నిన్న రాత్రి అఘోర కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో లేడీ అఘోరికి ఎలాంటి గాయాలు కాలేదు. యాక్సిడెంట్ పై లేడీ అఘోరీ స్పిందిస్తూ తనకు ఏమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. చీకట్లో ప్రయాణిస్తుండగా విజిబులిటీ లేక పోవడంతో కారు డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి కారణం పోలీసులే అని పేర్కొంది. కారు లైట్స్ పనిచేయడం లేదు..మెకానిక్ తో బాగు చేసుకొని బయలుదేరుతా అని చెప్పిన వినకుండా..అక్కడి నుండి పంపించారని..చీకట్లో ఇలా ప్రమాదానికి గురి కావాల్సి వచ్చిందని పేర్కొంది.
Read Also : New-Gen Maruti Suzuki Dzire: కొత్త మారుతి డిజైర్ ఎంత మైలేజ్ ఇస్తుంది? లాంచ్‌కు ముందే వెల్లడి!