దేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ అనేది కరువైందని సంగతి తెలియంది కాదు.. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు నిత్యం మహిళలపై దాడుల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి దగ్గరి నుండి మంచానపడ్డ ముసలవ్వ వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నెలలు కావొస్తున్నా ఇంకా కోర్ట్ లలో ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఇలా మహిళలపై జరుగుతున్న దాడులు చూసి సభ సమాజం తలదించుకోవడమే కాదు ఇప్పుడు దేవతలు సైతం కళ్లుమూసుకుని పరిస్థితి వచ్చింది.
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్కతాలో దసరా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తోంది. జీవచ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత (Durga Matha) కళ్లు మూసుకున్నట్టు, సింహం సిగ్గుతో తలదించుకున్నట్టు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘లజ్జా’ (అవమానం) ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రతి ఒక్కరు వీటిని చూసి ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను గుర్తు చేసుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల