Kuwait: షాపింగ్ మాల్ లో గొడవ పడిన వ్యక్తులు.. ఎటువంటి శిక్ష విధించారో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే?

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఏవైనా తప్పులు చేస్తే అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తారు అన్న విషయం తెలిసిందే. ఆ శిక్షలు ఏ విధంగా ఉంటా

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 05:00 PM IST

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఏవైనా తప్పులు చేస్తే అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తారు అన్న విషయం తెలిసిందే. ఆ శిక్షలు ఏ విధంగా ఉంటాయంటే అలాంటి తప్పు ఎవరైనా చేయాలి అంతే కాళ్లు వనకాల్సిందే. ముఖ్యంగా ప్రపంచంలో అన్నింటి కంటే గల్ఫ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. చిన్న తప్పుకు కూడా అక్కడ కఠిన శిక్షలు ఉంటాయి. ఇక రేప్, మర్డర్ లాంటి వాటికైతే ఎవరూ ఊహించలేనంత డిన్నమైన శిక్షలు ఉంటాయి. రోడ్డు మీద ఉరి తీయడం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం లాంటి శిక్షల గురించి కూడా మనం విని ఉంటాం.

ఇక అలాంటి ఒక కఠినమైన శిక్ష విధించడంతోనే గల్ఫ్ దేశం కువైట్ మళ్లీ వార్తల్లో నిలిచింది..మనదేశంలో ఎక్కడపడితే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాం. మనకి ఇళ్లని లేదు, రోడ్డని లేదు, స్కూల్ అని లేదు, ఆఖరికి లైబ్రరి అని కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గొడవ పడతాం. అయినా మన దేశంలో అది అంత పెద్ద తప్పు కూడా కాదు. ఇక బస్సుల్లో, మెట్రోల్లో అయితే ఇలాంటి గొడవలు చాలా కామెన్. అయితే గల్ఫ్ కంట్రీ కువైట్ లో కూడా ఇలాగే ఈజిప్ట్ కు చెందిన వ్యక్తులు గొడవకు దిగారు. ఒక షాపింగ్ మాల్ లో గొడవకు దిగిన వీరు భయానక వాతావరణం క్రియేట్ చేశారు. చేతికి ఏది దొరికితే దానితో కొట్టుకుంటూ పక్కన ఉన్న వారిని కూడా భయభ్రాంతులకు గురిచేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు చేరి ఇటు చేరి అది అంతర్గత మంత్రిత్వశాఖ కంటపడింది. ఇంకెముంది వారిపై కఠిన చర్యలకు అంతర్గత మంత్రిత్వశాఖ ఉపక్రమించింది. ఆ గొడవకు పాల్పడిన ఈజిప్ట్ ప్రవాసులందరినీ వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇంకేముంది వారు కువైట్ విడిచి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మళ్లీ ఇంకోసారి కువైట్ వెళ్లకుండా పోయింది వారికి. షాపింగ్ మాల్ లో గొడవకే దేశ బహిష్కరణ లాంటి కఠినమైన శిక్ష విధించారంటేనే అక్కడి చట్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.