సోషల్ మీడియాలో(social media) విపరీతంగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ (Kumari Aunty) మరోసారి వార్తల్లో నిలిచారు. ‘‘మీది తౌజన్ అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’’ అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఆమె.. ఫుడ్ స్టాల్ ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఉద్యోగులు, యువతతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆమె ఫుడ్ స్టాల్‌కి వెళ్లి భోజనం చేశారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న కారణంగా స్టాల్‌ను తొలగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేయగా, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఫుడ్ స్టాల్‌ను తొలగించొద్దని ఆదేశించారు.
ఈ సంఘటన తర్వాత కుమారి ఆంటీ సీఎం రేవంత్(CM Revanth)కు వీరాభిమానిగా మారిపోయారు. గతేడాది ఖమ్మం వరద బాధితులకు తనవంతు సాయంగా రూ.50 వేలు అందజేసిన ఆమె, రేవంత్ రెడ్డి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ ఒక్క ఆదేశంతో తన ఫుడ్ స్టాల్‌కు మద్దతుగా నిలిచారని, అందుకే ఆయనను దేవుడిగా కొలుస్తున్నట్లు తెలిపారు. తాజాగా కుమారి ఆంటీ తన ఇంట్లోని దేవుని గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో (Revanth Photo) పెట్టి పూజలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దేవుళ్ల ఫోటోతో పాటు రేవంత్ రెడ్డి ఫోటో ఉండటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సాయం చేసిన వ్యక్తిని మర్చిపోని కుమారి ఆంటీ నిజమైన అభిమాని’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో కుమారి ఆంటీ పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
సీఎం @revanth_anumula ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజ చేస్తున్న కుమారి ఆంటీ #HashtagU pic.twitter.com/24bBoLFdNS
— Hashtag U (@HashtaguIn) February 19, 2025