Krishna District Collector : కలెక్టర్ కు డాన్స్ వేసే స్వేచ్ఛ కూడా లేదా..?

Krishna District Collector : కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు 'AT HOME' పేరిట తేనీటి విందు ఇచ్చారు

Published By: HashtagU Telugu Desk
Krishna District Collector

Krishna District Collector

ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తూ పబ్లిక్ గా డాన్స్ (Dance) వేస్తే తప్పేంటి..? వారు మనుషులే కదా..? వారికంటూ ఓ స్వేచ్ఛ ఉండదా..? ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. వీరు ఇలా మాట్లాడుకోవడానికి కారణం.. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ(Krishna District Collector DK Balaji) డాన్స్ వేయడమే.

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ‘AT HOME’ పేరిట తేనీటి విందు ఇచ్చారు. ఇది సంప్రదాయంగా ఇచ్చేదే. ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు డాన్స్ చేయగా..అధికారులు చప్పట్లు కొట్టి అభినందించారు. అయితే ఈ వీడియోను ఆ ఎట్ హోంలో పాల్గొన్న ఎవరో సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో కలెక్టర్ దంపతులపై కొంత మంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

Rythu Bharosa : ఈరోజు ఒక్క రోజే రూ.530 కోట్లు జమ – మంత్రి తుమ్మల

కలెక్టర్ అయి ఉండి డ్యూయట్లకు డాన్సులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ కలెక్టర్ కూడా మనిషేనని వీళ్లు గుర్తించలేకపోతున్నారు. ఎట్ హోం కార్యక్రమం ప్రైవేటు కార్యక్రమం లాంటిదే. అదేమీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదిక కాదు. రోజంతా ప్రజా సమస్యల పరిష్కారంలో తీరిక లేకుండా ఉంటారు అధికారులు. కొన్నిప్రత్యేక సందర్భాల్లోనే కలుస్తూంటారు. ఈ సందర్భంగా ఇలాంటి కళా ప్రదర్శన చేస్తే.. వారేదో తప్పు చేశారన్నట్లుగా సోషల్ మీడియాలో విమర్శలుచేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  Last Updated: 27 Jan 2025, 07:58 PM IST