Site icon HashtagU Telugu

Mobile Explodes: జేబులో పేలిన సెల్ ఫోన్.. ప్రాణాలతో బయటపడ్డ 76 ఏళ్ల వ్యక్తి

Mobile

Mobile

సెల్ ఫోన్ వాడకం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. ఒక్కోసారి అంతకు మించి నష్టాలు కూడా ఉంటాయి. ఎక్కువ సమయం మొబైల్ ను ఛార్జింగ్ పెట్టడమో, లేక ఏళ్ల తరబడి ఒక వాడటం వల్ల మొబైల్ పేలిన ఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. కొందరు చనిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి స్వల్ప గాయాల పాలయ్యాడు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగింది. 76 ఏళ్ల వ్యక్తి తన జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకున్నాడు.

ఇలియాస్ అనే వ్యక్తి కుర్చీపై కూర్చుని మారొట్టిచల్ పరిసరాల్లోని టీ దుకాణంలో కాఫీ తాగుతున్నాడు. ఏమైందో ఏమోకానీ ఒక్కసారి మొబైల్ పేలి మంటలు వ్యాప్తించాయి. వెంటనే పెద్దాయన అలర్ట్ కావడంతో అంటుకున్న మంటలను వెంటనే అర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే ధరించిన అంగీ సగం కాలిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మూడోది.

Also Read: Adivi Sesh-Supriya: అక్కినేని ఇంట పెళ్లిభాజాలు.. అడవి శేష్ తో సుప్రియ పెళ్లి?