Kedarnath: కేదార్నాథ్ యాత్రలో ఊహించిన ఘటన.. సెల్ఫీ మాయలో పడి చివరికి అలా?

ఇటీవల కాలంలో యువత సెల్ఫీ పిచ్చిలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వింత వింత ప్రయోగాలతో ఫోటోలు

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 03:09 PM IST

ఇటీవల కాలంలో యువత సెల్ఫీ పిచ్చిలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వింత వింత ప్రయోగాలతో ఫోటోలు తీసుకుంటూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అయితే ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తూ వాటిని ఫోన్ లో చిత్రీకరించడానికి యువత ప్రాణాలను పోగొట్టుకుంటుంది. సెల్ఫీ పిచ్చిలో ప‌డి ఇప్ప‌టికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌నలు చాలా జరిగాయి.అయిన‌ప్ప‌టికి యువ‌తలో మార్పు రావ‌డం లేదు. అంతేకాకుండా సెల్ఫీల కోసం అలాగే వాటివల్ల వచ్చే లైకులు కామెంట్లు కోసం కొంతమంది యువత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.

తమ చుట్టూ ఏముంది, వారు ఎంత ప్రమాదకరమైన స్థలంలో ఉన్నారు అని పట్టించుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న దేశంలో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు.

 

అయితే పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు. తాళ్ల సహాయంతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. సెల్ఫీ పిచ్చిలో పడి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.