Site icon HashtagU Telugu

Kangana On Mahatma Gandhi: గాంధీపై కంగనా రనౌత్ కాంట్రవర్సీ పోస్ట్

Kangana On Mahatma Gandhi

Kangana On Mahatma Gandhi

Kangana On Mahatma Gandhi: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా మరో వివాదానికి తెర లేపారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆమె పెట్టిన పోస్ట్ కాంట్రవర్సీకి దారి తీసింది. ఈ రోజు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి , మహాత్మా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ కి “దేశ్ కే పితా నహీ, దేశ్ కే తో లాల్ హోతే హన్” అని క్యాప్షన్ ఇచ్చింది.

కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రిని గౌరవించే సమయంలో గాంధీ చేసిన కృషిని ఉద్దేశపూర్వకంగా తగ్గించే ప్రయత్నం చేశారంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. కంగనా ఇదివరకు చాలా సార్లు గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆమె సుభాష్ చంద్రబోస్ మరియు భగత్ సింగ్‌లకు మహాత్మా గాంధీ నుండి ఎటువంటి మద్దతు లభించలేదని కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. మహాత్మాగాంధీ సూచించిన ఒక చెంప కొడితే మరో చెంప చూపించడం అనేది ‘భిక్ష’కే దారి తీస్తుందని, స్వాతంత్య్రం కాదని ఆమె గతంలో వ్యాఖ్యానించారు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదని, 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని కంగనా అప్పట్లో వివాదాస్పద పోస్ట్ చేసింది. కంగనా అనేక వివాదాల్లో ఎలా చిక్కుకుంటుందో గమనిస్తే ఆమె సున్నితమైన విషయాలపై ఎక్కువగా స్పందిస్తుంటుంది.

Also Read: Pawan Interview: ఒకే ఒక్క ఇంట‌ర్వ్యూతో ఆ వార్త‌లకు చెక్ పెట్టిన ప‌వ‌న్‌..?