Site icon HashtagU Telugu

Free Gifts- Social Influencer : ఫ్రీ గిఫ్ట్స్ కోసం ఫ్యాన్స్ కొట్లాట.. సోషల్ మీడియా క్రియేటర్ అరెస్ట్

Free Gifts Social Influencer

Free Gifts Social Influencer

Free Gifts- Social Influencer : 21 ఏళ్ల ఆ కుర్రాడు.. సోషల్ మీడియాలో పాపులర్ కంటెంట్ క్రియేటర్..

కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు.. 

అయితే తన ఫాలోవర్స్ ను టెంప్ట్ చేసేలా అతడొక మెసేజ్ పెట్టాడు.. 

తాను ఒకచోట లైవ్  స్ట్రీమింగ్ చేయబోతున్నానని .. అక్కడికి వచ్చే వాళ్లకు ఫ్రీ గిఫ్ట్‌లు ఇస్తానని ప్రకటించాడు.

దీంతో ఏమైందంటే.. !!

Also read : Rahul Sipligunj: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆర్ఆర్ఆర్ సింగర్, గోషామహల్ నుంచి పోటీ?

యూట్యూబ్ లాగే అమెరికాలో “ట్విచ్”(Twitch) అనే లైవ్‌స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఒకటి ఉంది. అందులో న్యూయార్క్‌కు చెందిన 21 ఏళ్ల కై సీనట్ (Kai Cenat)కు 65 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్ లలోనూ అతడికి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అతడు ఇన్‌స్టా పేజీలో ఒక పోస్ట్‌ పెట్టాడు. న్యూయార్క్ లోని మన్‌హటన్‌ యూనియన్‌ స్క్వేర్‌ పార్క్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఈవెంట్‌ చేస్తానని వెల్లడించాడు. ఈ ప్రోగ్రాం కు వచ్చే ఫ్యాన్స్ కు ప్లే స్టేషన్‌ 5 గేమ్‌ కన్సోల్స్‌ సహా ఫ్రీ  గిఫ్ట్‌లు ఇస్తానని అనౌన్స్ చేశాడు. దీంతో శుక్రవారం సాయంత్రం కై సీనట్  చెప్పిన లొకేషన్ కు అభిమానులు వేలాదిగా పోటెత్తారు. అయితే ఫ్రీ గిఫ్ట్స్ కోసం ఫ్యాన్స్ మధ్య గొడవలు  జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పోలీసు అధికారులు సహా పలువురు గాయపడ్డారు. కై సీనట్ పై(Free Gifts- Social Influencer)  కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.