ఒళ్ళు కాలిపోతుంటే ఏం చేస్తారు.. ఎవరైనా సరే బాబోయ్ మంటలు అంటూ భయపడిపోతారు. దగ్గర్లో ఉన్న ఏ నీళ్లలోకైనా దూకేస్తారు కానీ ఒకతను కావాలని ఒంటిపై మంటలు అంటించుకొని పరిగెత్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
ఫ్రాన్స్(France)కు చెందిన జోనాథన్(Jonathan) ఒక ప్రొఫెషనల్ స్టంట్ మాన్(Stuntman). అతనికి చిన్నప్పటి నుంచి మంటలంటే ఇష్టం. అందుకే ఫైర్ ఫైటర్(Fire Fighter) గా ప్రొఫెషన్ తీసుకున్నాడు. అంతే కాదు ఫైర్ షోలు కూడా ఇచ్చేవాడు. మంటలు ఆర్పడం, వాటి నుంచి తప్పించుకోవడం, ఫైర్ జంగ్లింగ్ ఇలా వెరైటీ ప్రదర్శనలలో పాల్గొనేవాడు.
ఈ ఎక్స్పీరియన్స్ తో ఒక కొత్త రికార్డుకు ప్రయత్నించాడు. ఆక్సిజన్ అందకుండా మంటలు ఒంటికి అంటించుకుని అత్యంత వేగంగా పరిగెట్టి రికార్డు సృష్టించటానికి డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఒళ్ళంతా పూర్తిగా కవర్ అయ్యేలా ఒక సూట్ వేసుకుని రన్నింగ్ ట్రాక్ లో నిలబడ్డాడు. తర్వాత అతని సహాయకులు అతని వీపు భాగానికి నిప్పంటించారు. ఇంకా అప్పుడు మొదలుపెట్టిన పరుగు 17 సెకండ్లలో 100 మీటర్లు దాటగానే పూర్తయింది. అతను పరిగెత్తిన స్పీడ్ కి డెస్టినేషన్ పాయింట్ కి చేరుకునే సగం మంటలు ఆగిపోయాయి.
New record: The fastest full body burn 100 m sprint without oxygen – 17 seconds by Jonathan Vero (France)
Jonathan also set the record for the farthest distance ran in full body burn during this attempt at 272.25 metres! 🔥 pic.twitter.com/J0QJsPNkPf
— Guinness World Records (@GWR) June 29, 2023
అయినా సరే సహాయకులు అతనిపై మంటలు ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ను స్ప్రే చేశారు. మొత్తానికి 100 మీటర్లు ఆక్సిజన్ లేకుండా మంటలు అంటించుకొని 17 సెకెన్లలో పరిగెత్తి గిన్నిస్ రికార్డ్(Guinness World Record) సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ (Viral video) అవుతోంది. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. జోనాథన్ ధైర్యానికి కొందరు వహ్వా అంటుంటే, ఇలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు చేస్తారు, ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్ల అవసరం ఏముంది అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు.
Also Read : Viral Video: గాలి వాన బీభత్సం.. రెప్పపాటు కాలంలో తప్పిన భారీ ప్రమాదం?