పెంపుడు కుక్కల (Pet Dog) పట్ల ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. సొంత పిల్లలతో సమానంగా వాటిని చూసుకునే వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం విశేషం. తాజాగా పెంపుడు కుక్క బర్త్ డే కు రూ.5 లక్షలు ఖర్చు (5 Lakhs cost) చేసి వార్తల్లో నిలిచింది సప్నా అనే మహిళ. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈమె తన పెంపుడు కుక్క పుట్టినరోజు కోసం ఒకటి , రెండు కాదు ఏకంగా రూ.5 లక్షలు ఖర్చు చేయడం విశేషం.
Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ
కుక్క పుట్టినరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో సప్నా ఎక్కడా రాజీ పడలేదు. రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్‌తో వేడుకకు ఎంతో గ్రాండ్ గా చేసింది. కేక్ డిజైన్ మాత్రమే కాకుండా, కుక్క కోసం ప్రత్యేకంగా దుస్తులు, అలంకరణలు కూడా చేయడం విశేషం. ఈ ఆహ్లాదకరమైన వేడుకకు కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, ఆత్మీయులు హాజరయ్యారు.
వేడుకలో 300 మందికి ఆతిథ్యం అందించడం మరో విశేషం. నాణ్యమైన భోజన వసతులతో ఆహార కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం కుటుంబ సభ్యులకే కాకుండా, పెంపుడు కుక్కల ప్రేమికులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించడం జరిగింది. ఇందువల్ల ఈ వేడుకకు మరింత ప్రత్యేకత ఏర్పడింది. సప్నా ఈ వేడుక ద్వారా తన పెంపుడు కుక్క పట్ల ప్రేమను వ్యక్తం చేశారు. పెంపుడు జంతువుల పట్ల ప్రేమ, వాటి పట్ల అనురాగం ఎలా ఉండాలి అనే దానికి సప్నా ఉదాహరణగా నిలిచారు. ఈ తరహా చర్యలు సమాజంలో జంతు ప్రేమను పెంపొందించడంలో సహాయపడతాయి. అయితే, అధిక ఖర్చు చేయడంపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
