Site icon HashtagU Telugu

Male goat giving milk: బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది.. పాలు ఇస్తున్న మగమేక.. చూసేందుకు ఎగబడ్డ జనం!

Th (10)

Th (10)

Male goat giving milk: వింతలు, విచిత్రాల గురించిy బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పేవన్నీ దాదాపు జరుగుతున్నాయి. నూటికి నూరు శాతం అన్నీ జరుగుతున్నాయి. దీంతో వింత సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు బ్రహ్మంగారు చెప్పినవి గుర్తుకొస్తాయి. ఇప్పుడు మరోసారి మరో వింత పరిణామం చోటుచేసుకుంది. ఓ మగ మేక పాలు ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మగ మేక పాలు ఇస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు అదే జరగడంతో ఆసక్తికరంగా మారింది.

మేక పాలు ఇస్తున్న ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కరౌలిలోని సపోత్రా తాలూకా గోత్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అమీర్ ఖాన్ అనే కాపరి వద్ద పదల సంఖ్యలో మేకలు ఉంటాయి. అయితే అతని దగ్గర ఉన్న ఓ రెండేళ్ల మగ మేక ఆడ మేక లాగే పాలు ఇవ్వడం షాకింగ్‌గా మారింది. దీంతో దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. అమీర్ ఖాన్ దగ్గర చాలా మేకలు ఉండగా.. రోజు వాటిని మేత కోసం అడవికి తీసుకెళ్లతాడు.

ఈ రెండేళ్ల చిన్న మేక అంటే అమీర్ ఖాన్‌కు ఎంతో ఇష్టమట. దీనికి ముద్దుగా బాద్ షా అనే పేరును అమీర్ ఖాన్ పెట్టుకున్నాడు. ఇతర మేకలతో పోలిస్తే ఈ మేక చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మేగ మేక అయినప్పటికీ కూడా.. ఈ మేకకు పురుషాంగం, వృషణాలతో పాటు ఆడ మేకలాగా రెండు పొదుగులు కూడా ఉన్నాయి. దీంతో ఆడ మేకలాగే పాలు ఇస్తోంది. కరణ్ పూర్‌లోని భైరోగావ్‌లో ఈ మేకను అమీర్ ఖాన్ రూ.51 వేలకు కొనుగోలు చేశాడట. ఈ మేక గురించి తెలిసి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బిజినెస్ మెన్ అమీర్ ఖాన్ దగ్గర నుంచి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు.

అమీర్ ఖాన్ ఈ మేకను రూ.లక్షకు అమ్మేశాడు. దీంతో త్వరలోనే ఈ మేక బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లనున్నారని అమీర్ ఖాన్ చెబుతున్నాడు. ఈ మేక రోజూ గేదె పాలు తాగడంతో పాటు ధోవ్ అకాసియా చెట్టు ఆకు, గోధుమ గింజలు, నానపెట్టిన పప్పును తింటుందని అమీర్ ఖాన్ చెబుతున్నాడు.