Site icon HashtagU Telugu

#ChatGPT ను ఇలా కూడా వాడతారా? నీ ఐడియా సూపర్ బాస్

Chatwatermelon

Chatwatermelon

ప్రస్తుతం టెక్నాలజీ (Technology) ప్రాధాన్యత అంతులేని స్థాయికి చేరింది. ప్రతి విషయానికీ ఆన్‌లైన్ ఆధారపడే కాలంలో, ఆహార పదార్థాల ఎంపికలో కూడా చాలామంది యాప్‌లు, టూల్స్‌ను వినియోగిస్తున్నారు. తాజాగా ఒక యువకుడు పుచ్చకాయ ఎర్రగా ఉందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ChatGPT సహాయాన్ని తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీడియో రూపంలో పుచ్చకాయలను (Watermelon) చూపించి, అందులో ఏది తియ్యగా, ఎర్రగా ఉందో చెప్పమని ChatGPTను అడిగాడు.

Aliens Attack: ఏలియన్స్ ఎటాక్.. రాళ్లుగా మారిన సైనికులు.. సంచలన నివేదిక

ChatGPT అందించిన పలు సూచనల ఆధారంగా పుచ్చకాయలపై ఉన్న రంగు, గీతలు, ఆకృతి వంటి వివరాల ఆధారంగా ఒకదాన్ని ఎంపిక చేసి సూచించింది. ఆ యువకుడు ఆ పుచ్చకాయను కట్ చేసి చూసినప్పుడు అది నిజంగానే ఎర్రగా ఉండటంతో, ఇది నిజంగా అద్భుతమైందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఉదంతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. టెక్నాలజీని ఇలా వినియోగించడం అవసరమా? అని కొంతమంది సెటైర్లు వేస్తుండగా, మరికొందరు ఇది భవిష్యత్తులో సాధారణంగా మారే దిశగా సాగుతోందని అంటున్నారు.

పుచ్చకాయ కట్ చేసి చూస్తే ఏదో తేలిపోతుంది కదా అని కొన్ని కామెంట్లు వస్తుండగా, టెక్నాలజీపై అధిక ఆధారపడటం వల్ల మానవ అనుభవం, ఊహా శక్తిని మనం వదులుకుంటున్నామేమో అనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అయినా ఈ ఘటన ద్వారా ChatGPT సొగసైన విశ్లేషణతో సరైన ఎంపిక సూచించగలదని మరొకసారి నిరూపితమైంది. మొత్తంగా చిన్న విషయానికే టెక్నాలజీపై ఆధారపడిన ఈ ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.