Baba Vanga : వచ్చే నెలలో ‘వంగ బాబా’ చెప్పింది జరగబోతోందట.. ఏమిటో తెలుసా ?

Baba Vanga : వంగబాబా చాలా ఫేమస్.  మన తెలుగు రాష్ట్రాలకు వీర బ్రహ్మేంద్రస్వామి ఎలాగో.. బల్గేరియా ప్రజలకు వంగ బాబా అలా !!

  • Written By:
  • Updated On - February 18, 2024 / 08:53 AM IST

Baba Vanga : వంగబాబా చాలా ఫేమస్.  మన తెలుగు రాష్ట్రాలకు వీర బ్రహ్మేంద్రస్వామి ఎలాగో.. బల్గేరియా ప్రజలకు వంగ బాబా అలా !! ఆమె ఆనాడు చెప్పిన ఎన్నో జోస్యాలు.. ఇప్పుడు నిజం అవుతున్నాయని చెబుతుంటారు !! నాడు వంగబాబా చెప్పిన ఒక జోస్యం.. వచ్చే నెలలో నిజం కాబోతోంది. ఇంతకీ అదేమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

2024 సంవత్సరంలో క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వస్తుందని వంగబాబా చెప్పారని తెలుస్తోంది. ఆ జోస్యం ఇంకొన్ని వారాల్లో నిజం కాబోతోంది. ఎందుకంటే.. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. తమ సైంటిస్టులు క్యాన్సర్‌కు వ్యాక్సిన్ తయారు చేయడంలో దాదాపు సక్సెస్ అవుతున్నారని, త్వరలోనే ఆ వ్యాక్సిన్ పేషెంట్లకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అయితే ఎలాంటి క్యాన్సర్‌కు ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందనే వివరాలను పుతిన్ చెప్పలేదు. వంగబాబా అంచనాల ప్రకారమే ఈ సంవత్సరం మార్చిలో క్యాన్సర్ వ్యాక్సిన్‌పై రష్యా అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈవిషయాన్ని వంగబాబా(Baba Vanga)  25 ఏళ్ల క్రితమే ఎలా చెప్పగలిగారు ? అనేది ఆశ్చర్యకర అంశం. వంగ బాబా ఈ విషయాన్ని చెప్పలేదనీ, ఇది అల్లిన కట్టుకథ అని అనేవారు కూడా ఉన్నారు. వంగ బాబా వాస్తవంగా ఏం చెప్పారన్న దానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేవు. అందువల్ల సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఏ సంచలన ఘటన జరిగినా, అది వంగ బాబా ముందే చెప్పారని లింక్ పెట్టేస్తున్నారు. దాంతో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తేలట్లేదు.

Also Read : Most Popular CMs : దేశంలోనే పాపులర్ సీఎంల లిస్టు చూశారా ?

జపాన్, యూకేలో ఆర్థిక సంక్షోభం వస్తుందని కూడా గతంలో వంగబాబా చెప్పారని చెబుతుంటారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రజల జీవన వ్యయం పెరిగింది. జీడీపీ తగ్గుతోంది. జపాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 6 నెలలుగా ఈ దేశం మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. ఈ కారణంగానే ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో జపాన్.. జర్మనీ కంటే వెనకబడింది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో జపాన్ నిలిచింది. 9/11 ఉగ్రవాద దాడులు, డయానా మరణం, చెర్నోబిల్ దుర్ఘటన, బ్రెగ్జిట్ వంటి వాటిని కూడా వంగబాబా ముందే చెప్పారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితులు, అప్పులు పెరగడం వంటివి జరుగుతాయని వంగబాబా ముందే చెప్పారనే ప్రచారం జరుగుతోంది.

Also Read : YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం

2025 సంవత్సరంలో యూరప్‌లో ఉగ్రదాడులు జరుగుతాయని, ఓ పెద్ద దేశం జీవ రసాయన ఆయుధాలను ప్రయోగిస్తుందని వంగ బాబా చెప్పారనే ప్రచారం కూడా  జరుగుతోంది.  ఆ ఏడాది భయంకరమైన వాతావరణ మార్పులను చూస్తారని అంచనా వేస్తున్నారు. సైబర్ దాడులు పెరుగుతాయనీ, పవర్ గ్రిడ్‌లు, వాటర్ బ్యారేజీలపై సైబర్ దాడులు జరుగుతాయని తెలిపారు. రష్యాకి చెందినవారే ఆ దేశ అధ్యక్షుడిని చంపేందుకు యత్నిస్తారని కూడా వంగబాబా చెప్పారనే టాక్ వినిపిస్తోంది. 12 ఏళ్ల వయసులో చూపు కోల్పోయిన వంగబాబా.. ఆకాశంలోకి చూస్తూ భవిష్యత్తును అంచనా వేసేవారు. ఆమె 1996 ఆగస్ట్ 11న 84 ఏళ్ల వయసులో మరణించారు.