Site icon HashtagU Telugu

Iran: అమ్మాయి స్కర్టు, టాప్ వేసుకుందని వెంబడించి మరీ దాడి!

C83aa4d9 F40a 4ff9 9e6a 7ea94fe7f029

C83aa4d9 F40a 4ff9 9e6a 7ea94fe7f029

Iran: కొన్ని దేశాల్లో అమ్మాయిలపట్ల కఠిన నియమాలు, నిబంధనలు అమలవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ధరించే దుస్తులపై పలు దేశాల్లో ఆంక్షలనేవి ఇంకా ఉన్నాయి. ఇస్లామిక్ దేశాల్లో అమ్మాయిల చట్టాలు అస్సలు లెక్కలోకి రావు. అసలు అక్కడ మహిళల కోసం ప్రత్యేక చట్టాలు లేవు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో మహిళలకు సరైన రక్షణ లేదు. సరైన చట్టాలు లేవు. వారిపై ప్రత్యేక ఆంక్షలనేవి ఉంటాయి.

ఇవంతా ఇప్పుడు ఎందుకు చర్చించాలంటే తాజాగా ఓ మహిళ పట్ల అక్కడి ప్రజలు దారుణానికి ఒడిగట్టారు. ఓ అమ్మాయి స్కర్టు, టాప్ ధరించిందని ఆమెపై దాడికి దిగారు. 17 ఏళ్ల అమ్మాయి ఇరాక్ లో జరిగే కుర్దిస్తాన్ ప్రాంతంలో బైక్ రేసు జరుగుతుండగా అక్కడికి చేరుకుంది. అయితే అక్కడికి ఆమె స్కర్టు, టాప్ ధరించి వచ్చింది. ఆమెను గమనించిన అక్కడి యువకులు ఆమెను ఏడిపించడం మొదలు పెట్టారు.

దాదాపు 16 మంది ఆ యువతిపై దాడికి దిగారు. ఆమెను వెంబడించి తీవ్రంగా గాయపరిచారు. అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతున్నా వదల్లేదు. వెంబడించి మరీ దాడికి దిగారు. అక్కడే ఉన్న మరికొందరు ఆ సంఘటనను ఫోన్లో వీడియో తీసి పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది. ఈ ఘటన డిసెంబర్ 30వ తేదిన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ అమ్మాయితో ఉన్న తన ఫ్రెండ్ ను కూడా దాడి చేశారు. వీడియో వైరల్ అవ్వడంతో అక్కడి పోలీసులు దాడికి యత్నించిన 16 మంది యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన చాలా మంది విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.