Site icon HashtagU Telugu

Video Viral: వృద్ధురాలి కళ్ళలో ఆనందం కోసం అలాంటి పని చేసిన ఐపీఎస్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్?

Video Viral

Video Viral

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ అవుతోంది. ఆ వీడియోలో ఒక ముసలావిడ కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేసిన పనిని చూసి నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యువర్ గ్రేట్ మేడం అంటూ ఐపీఎస్ ఆఫీసర్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఉత్తర ప్రదేశ్‌ బులందర్‌షెహర్‌ జిల్లా ఐపీఎస్‌ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా స్వదేశ్‌ చిత్ర అనుభూతిని పొందారట.

ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్‌ అయిన షారూక్‌ ఖాన్‌ తన ఊరికి కరెంట్‌ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్‌ అశుతోష్‌ గోవార్కికర్‌ స్క్రీన్‌ మీద ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. అటువంటి క్షణాల్ని అనుభూతినే తాను పొందానని ఐపీఎస్‌ అను స్వయంగా ట్వీట్‌ చేసింది. నూర్జహాన్‌ అనే 75 ఏళ్ళ వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్‌ సదుపాయం అందించింది. ఆమె ఇంట్లో లైట్‌ వెలగగానే అటు అను ముఖంలో ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్‌ ద్వారా ఆమె పంచుకున్నారు.

 

ఆమె ఇంటికి కరెంట్‌ తెప్పించడంలో సహకరించిన ఎస్‌హెచ్‌వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అనుకృతి శర్మ 2020 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారిణి. ప్రస్తుతం బులంద్‌షెహర్‌కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్‌ తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్‌ అనుకృతి వెంటనే రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. అంతేకాకుండా ఒక టేబుల్ ఫ్యాన్‌ ని కూడా ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అందరు స్వీట్లు కూడా పంచుకున్నారు. ఆ వృద్ధురాలుని సంతోషంతో హత్తుకుంది ఐపీఎస్‌ అను.