Python : మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి ఎక్కిన కొండచిలువ.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..!!

alcohol : పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి మీదకు ఎక్కి పైకి కిందకు తిరుగుతున్న..అతడికి ఏమాత్రం సోయి లేదు

Published By: HashtagU Telugu Desk
Intoxicated Man Rescued Fro

Intoxicated Man Rescued Fro

మద్యం (Alcohol) కిక్ ఎంతకైనా తెగించేలా చేస్తుందనే సంగతి తెలిసిందే. మద్యం కిక్ మాత్రమే కాదు ధైర్యం కూడా ఇస్తుందని అంటారు. కొంతమంది ధైర్యం కోసం మద్యం సేవిస్తూ ఉంటారు. మరికొంతమంది కిక్ కోసం సేవిస్తుంటారు. అతిగా మద్యం సేవిస్తే చుట్టుపక్కల ఏంజరుగుతుందో..ఏంచేస్తున్నామో..ఎలాంటి ప్రమాదంలో ఉన్నామో కూడా తెలియదు. ఆలా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా చాలానే జరిగాయి. తాజాగా ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం మత్తులో ఉండగా..అతడి పైకి భారీ కొండచిలువ (Python) ఎక్కి హల్చల్ చేసిన ఘటన కర్నూలు – అవుకు మండలం సింగనపల్లి (Singanapalli) లో జరిగింది.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లారీ నడుపుతుంటాడు..రోజులాగానే లారీ డ్యూటీ దిగి, మార్గ మద్యంలో ఫుల్ గా మద్యం సేవించాడు. ఆ పక్కనే చీకట్లో ఓ అరుగు కనిపించడంతో అక్కడ కూర్చున్నాడు. అయితే పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి మీదకు ఎక్కి పైకి కిందకు తిరుగుతున్న..అతడికి ఏమాత్రం సోయి లేదు..అలాగే కూర్చున్నాడు. ఇది గమనించిన స్థానికులు.. కట్టెల సహాయంతో పక్కకు లాగేశారు. ఒంటిపై కొండచిలువ నాట్యం చేస్తున్నా లారీ డ్రైవర్‌కు స్పర్శ తెలియకపోవడంతో ఇలా ఉన్నాడేంటి అంటూ గ్రామస్తులు నవ్వుకున్నారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Pooja Hegde : చూపించాల్సినవన్నీ చూపిస్తూ మతి పోగొడుతున్న బుట్టబొమ్మ ..!!

  Last Updated: 15 Oct 2024, 01:18 PM IST