Site icon HashtagU Telugu

Time Table: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్లాడి టైం టేబుల్ ఫొటో?

Time Table

Time Table

సాధారణంగా నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చిన్నపిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయని చెప్పవచ్చు. వారు చేసే చిలిపి చిలిపి పనులకు ఎవరైనా కడుపుబ్బా నవ్వాల్సిందే. అలా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూనే ఉంటాయి. అటువంటి చిలిపి వీడియోలు చూసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి క్షణాల్లో మాయం అవుతుంటుంది. సాధారణంగా చిన్నారులకు అంత త్వరగా చదువుపై మనసు లగ్నం కాదు.

అయితే కొందరు పిల్లలు అటు టీచర్లు చెప్పారనో లేదా తల్లిదండ్రులు చెప్పారనో సొంత టైమ్‌ టేబుల్‌ తయారు చేసుకుంటుంటారు. పిల్లలు చదువుకోమని చెబితే ఏడవడం కడుపు నొప్పిస్తోంది అంటూ డ్రామాలు ఆడటం లాంటివి చేస్తుంటారు. ఇంకొందరు క్రమశిక్షణ ప్రకారం రోజువారీ దినచర్య రాసుకుంటారు. ఈ కోవలోనే ఒక కుర్రాడు తయారు చేసుకున్న టైమ్‌ టేబుల్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఆరేళ్ల పిల్లవాడు తనను తాను క్రమశిక్షణతో ఉంచుకునే ఉద్దేశంతో తన 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ రూపొందించుకున్నాడు.

 

ఈ పిల్లాడు తాను చేయాల్సిన అన్ని పనులకు అధిక సమయం కేటాయిస్తూ, చదువుకునేందుకు కేవలం 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇదే నెటిజన్లను తెగ నవ్విస్తోంది. మామూలుగా ఇతర పనులకు తక్కువ సమయం కేటాయించి చదువుకోడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లాడు మాత్రం అన్ని పనులకు ఎక్కువ సమయానికి కేటాయించి చదువుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే టైం టేబుల్ కేటాయించుకోవడం నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version