సోషల్ మీడియాలో లైక్‌లు మరియు ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొందరు చేయకూడని పనులు చేసేందుకు కూడా వెనకాడట్లేదు. నిబంధనలను ఉల్లంఘించి, ఆపై చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. మొదట్లో ఈ విషయాన్ని గుర్తించక పోయినా తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇండోర్ (Indore) నుంచి అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం ఓ యువతి బ్రా, షార్ట్ వేసుకుని వీధుల్లో నడుస్తూ హల్చల్ చేసింది. యువతి అసభ్యకర రీతిలో దుస్తులు ధరించి రోడ్డున వెళ్తుండగా ఇతర ప్రయాణికులు, పాదచారులకు ఇబ్బంది కలిగించింది. రోడ్డున పోతున్న ప్రేమికులు ఆ సన్నివేశాన్ని చూడలేకపోయారు. కొందరు అమ్మాయిలు తాను ప్రేమిస్తున్న అబ్బాయి మొహాన్ని కప్పేయడం లాంటివి వీడియోలో చూడొచ్చు.అయినా సదరు యువతి ఏ మాత్రం మొహమాటం లేకుండా చాలా ధైర్యంగా విధుల్లో తిరుగుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సదరు యువతిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఎవరైనా బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకోవాలి.
భారత రాజ్యాంగం ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించింది. దీనితో పాటు రాజ్యాంగంలో ప్రజలకు కొన్ని ప్రాథమిక హక్కులను కూడా కల్పించారు. దీనితో పాటు రాజ్యాంగం ప్రాథమిక విధులను కూడా నిర్ణయించింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షకు అర్హులు. తాజాగా ఇండోర్ లో ఓ యువతి బ్రా, షార్ట్ వేసుకుని ఇండోర్ వీధుల్లో తిరుగుతున్న ఉదంతం కూడా అలాంటిదే. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేస్తే అది అశ్లీలతను వ్యాపింపజేయడం నేరం కిందకు వస్తుంది.
VIDEO: https://x.com/i/status/1839182891378524290
ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ సెక్షన్ 296 ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే రూ.1000 వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. దీంతో పాటు 3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం ఏ వ్యక్తి కూడా బహిరంగ ప్రదేశంలో ఇలాంటి పని చేయకూడదు. దీని కారణంగా ఇతర వ్యక్తులు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు లేదా అవమానించబడవచ్చు. ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో అలాంటి అసభ్య ప్రవర్తన చేస్తే, లేదా తక్కువ దుస్తులు అంటే బ్రా లాంటి బట్టలు ధరించి తిరుగుతుంటే, అక్కడ ఉన్న ఎవరైనా దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇండోర్‌లో బ్రా మరియు షార్ట్‌లు ధరించి వీధుల్లో తిరుగుతున్న వీడియో వైరల్ అయిన అమ్మాయి ఈ సంఘటన తర్వాత బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది.