Indonesia: రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కుని ఢీ కొట్టిన రైలు.. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో?

ప్రస్తుత రోజుల్లో మనుషులకు ఓర్పు సహనం అన్నది లేకుండా పోయింది. ఏ విషయంలో కూడా ఓర్పు సహనాన్ని కూడా పాటించలేకపోతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 03:42 PM IST

ప్రస్తుత రోజుల్లో మనుషులకు ఓర్పు సహనం అన్నది లేకుండా పోయింది. ఏ విషయంలో కూడా ఓర్పు సహనాన్ని కూడా పాటించలేకపోతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అలాగే రైల్వే గేట్ దాటుతున్నప్పుడు మనసులు కనీసం ఒక రెండు నిమిషాలు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు. దీంతో రైల్వే గేట్ దాటుతున్న సమయంలో గతంలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొందరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడగా మరికొందరికి గాయాలు కూడా అయ్యాయి.

ఇప్పటికే అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అటువంటి భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన ఎవరికైనా సరే భయం వేయకమనదు. అసలేం జరిగిందంటే.. ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకువచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ట్రక్కు నుజ్జు నుజ్జు అవ్వడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి.

ఆ ఘటనతో రైలులోని ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. అయితే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుంది అన్న అనుమానం రాక మానదు. కానీ అందరు అనుకున్నట్లు అక్కడ ఎవరికీ ఏమి జరగలేదు అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరు క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రమే గాయాలు అయ్యాయి.