Flier Slapped Pilot : విమానం 13 గంటలు ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి ఎటాక్

Flier Slapped Pilot : ఇండిగో విమానం ఒక గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 13 గంటలు ఆలస్యమైంది. 

  • Written By:
  • Updated On - January 15, 2024 / 01:41 PM IST

Flier Slapped Pilot : ఇండిగో విమానం ఒక గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 13 గంటలు ఆలస్యమైంది.  ఆ ఆలస్యం గురించి ప్రకటన చేస్తున్న పైలట్‌పై  విమానంలోని ఒక ప్రయాణికుడు ఆగ్రహంతో భౌతికదాడికి పాల్పడ్డాడు. ఈ ఎటాక్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఆదివారం ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-2175) పొగమంచు కారణంగా 13  గంటలు ఆలస్యమైంది. ఈ విమానంలో పైలట్‌పై దాడి చేసిన ప్రయాణికుడిని సాహిల్ కటారియాగా గుర్తించారు. ప్రయాణికుడిపై పోలీసులకు  ఫ్లైట్ కో-కెప్టెన్ అనుప్ కుమార్‌ ఫిర్యాదు చేశాడు. ఎయిర్‌లైన్ కూడా అతడిపై కేసును నమోదు చేయనుంది.  ఈ ఘటన జరిగిన వెంటనే  ప్రయాణికుడిని విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు.ఇలాంటి ప్రయాణికులను నో ఫ్లై లిస్టులో పెట్టాలనే డిమాండ్ వినవస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరాదిని చలి వణికిస్తోంది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 110 విమానాలు ఆలస్యం కాగా, 79 విమానాలు రద్దయ్యాయి. విమానాల సగటు ఆలస్యం సమయం 50 నిమిషాలుగా ఉంది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీ, కోల్‌కతా నుంచి నడిచే ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా వంటి ప్రధాన విమానయాన సంస్థల సేవలకు అంతరాయం(Flier Slapped Pilot) వాటిల్లుతోంది.

Also Read: Indian Students Dead : అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ అనుమానాస్పద మృతి

తాజాగా ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెల్సీయస్‌కు పడిపోయింది. లోధి రోడ్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయింది. తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచుతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తీవ్రపొగమంచు కారణంగా ఢిల్లీ, కోల్ కతాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమానాలపై ప్రభావం చూపుతాయని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. విమాన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. ఢిల్లీ విమానాశ్రయంలో 168 విమానాలు ఆలస్యం అయ్యింది. మరోవైపు 84 విమానాలు రద్దు చేశారు. అయితే గోవాకు వెళ్లే విమానం కోసం 13 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా లాంటి ప్రధాన విమానయాన సంస్థలు లేట్ గా నడుస్తాయని సమాచారం. తెల్లవారుజామున ఢిల్లీ-కోల్‌కతా విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించినట్లు విస్తారా ఎయిర్ లైన్స్ తెలిపింది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి.ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు.  పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.