Indigo: విమానంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు.. ఎమర్జెన్సీ లాండింగ్.. చివరికి?

ఈ మధ్యకాలంలో చాలా వరకు విమానంలో, విమానాశ్రయాలలో కొన్ని రకాల భయంకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వ్యక్తులు కూడా

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 04:20 PM IST

ఈ మధ్యకాలంలో చాలా వరకు విమానంలో, విమానాశ్రయాలలో కొన్ని రకాల భయంకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వ్యక్తులు కూడా విమానాలలో విమానాశ్రయంలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ అనవసరంగా కటకటాల పాలవుతున్నారు. కొందరి ఆవేశం వారిని ఊచలు లెక్కబెట్టించేలా చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా విమానాశ్రయం విమానాలలో చోటు చేసుకుంటుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. కొన్ని కొన్ని సార్లు ప్రయాణికులకు కారణంగా ఫ్లైట్లను ఎమర్జెన్సీగా లాండింగ్ చేయాల్సిన పరిస్థితిలో కూడా వస్తున్నాయి.

తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడంతో వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానాన్ని ఎమర్జెన్సీగా లాండింగ్ చేసినప్పటికీ లాభం లేక పోయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ముంబయి నుంచి రాంచీ బయలుదేరిన ఇండిగో విమానంలో తాజాగా చోటు చేసుకుంది. ఒక 62 ఏళ్ల ప్రయాణికుడు కొంతకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

ఇండిగో విమానంలో రాంచీకి బయలుదేరిన అతడు విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఇక వెంటనే స్పందించిన సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం అందించి విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌ లో ల్యాండ్‌ చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలను కాపాడడానికి అధికారులు కూడా చాలా కష్టపడి ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు.