Viral : అమెరికాలో మరోసారి భారతీయ విద్యార్థులపై పోలీసుల దాష్టీకం బయటపడింది. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఓ భారతీయ విద్యార్థిని పోలీసులు అతి క్రూరంగా వ్యవహరించారు. విద్యార్థిని నేలపై పడేసి, చేతులకు సంకెళ్లు వేసి, నలుగురు అధికారులు అతడిపై అణచివేత చర్యలు చేపట్టారు. ఇద్దరు అధికారి గట్టిగా అతడిపై కూర్చుండగా, మిగిలిన వారు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఈ దృశ్యాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఒక చిన్న తప్పు జరిగినా సరే, ఒక విద్యార్థిని ఉగ్రవాదిలా పట్టుకుని ఇలా దారుణంగా వ్యవహరించడమేంటి అని ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. స్థానిక అధికారులతో సంప్రదనలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ఈ ఘటనపై భారతీయ అమెరికన్ వ్యవస్థాపకుడు కునాల్ జైన్ తన అనుభవాన్ని షేర్ చేస్తూ, “నిన్న రాత్రి న్యూవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చూశాను. ఓ యువ విద్యార్థిని అరెస్ట్ చేస్తూ పోలీసులు అతడిపై అమానుషంగా ప్రవర్తించారు. అతని చేతులకు బేడీలు వేసి నేలపై నొక్కేశారు. తాను ఏడుస్తూ అసహాయంగా కనిపించాడు. ఇది చూసి మనసు తీవ్రంగా బాధపడింది. ఉగ్రవాదులతో కూడా ఇంత తీవ్రంగా వ్యవహరించడాన్ని నేనెప్పుడూ చూడలేదు,” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
జైన్ చెప్పిన వివరాల ప్రకారం, విద్యార్థి హిందీలో మాట్లాడుతుండటంతో అధికారులు అతని మాటలు అర్థం చేసుకోలేకపోయారు. సహాయం చేయమంటారా అని అడిగినప్పటికీ, అక్కడి అధికారులు స్పందించకపోవడం గమనార్హం. చుట్టూ 50 మందికిపైగా ప్రజలు ఉన్నా ఎవ్వరూ ఆ విద్యార్థికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి విద్యార్థికి న్యాయం జరగాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Shocking : అమెరికాలో చైనా స్మగ్లింగ్ కుట్ర బహిరంగం.. బయో వెపన్స్‌తో పట్టివేత