Site icon HashtagU Telugu

Balesh Dhankar: బయటపడిన భారతీయ సంతతి వ్యక్తి నిజస్వరూపం.. మత్తుమందు ఇచ్చి మరి అత్యాచారం?

Balesh Dhankar

Balesh Dhankar

పైన పటారం లోన లొటారం అన్నట్టుగా పైకి బాగా కనిపిస్తూనే చాలామంది లోపల ఉన్న కామాంధులను మృగాలను బయటకు తీస్తున్నారు. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి నిజస్వరూపం కూడా తాజాగా బయటపడింది. అసలేం జరిగిందంటే.. అతగాడి పేరు భలేష్ ధన్ ఖర్. ఆస్ట్రేలియాలోని భారత సంతతి కమ్యూనిటీలో అతనికి మంచి గుర్తింపు కూడా ఉంది. గతంలో అతడు ఆస్ట్రేలియాలో భారత్ కు చెందిన ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేశాడు. కొరియన్ సినిమాలు కొరియన్ మహిళల పట్ల ఆకర్షితుడైన ఆ భలేష్ ఎలా అయినా కొరియన్ మహిళలను అనుభవించాలి అనుకున్నాడు.

అనుకున్న ప్రకారమే ఒక పథకాన్ని రచించాడు. 2017లో కొరియన్ అనువాదకులు కావాలి అంటూ ఒక నొప్పులు ఉద్యోగ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూసిన చాలామంది కొరియర్ యువతులు అతడిని సంప్రదించారు. అదే అదునుగా భావించిన భలేష్ ఆ కొరియన్ యువతులకు మాయమాటలు చెప్పి గాళం వేసి మొదట వారిని ఒక హోటల్ కి తీసుకెళ్లి అక్కడే ఇంటర్వ్యూ చేసేవాడు. ఆ తర్వాత డిన్నర్ కి రమ్మని పిలవగా ఉద్యోగం ఇస్తాడు కదా అని ఆ యువతులు కూడా అతని మాయ మాటలు వినీ అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లగా అలా వచ్చిన వారికి డ్రింక్ లేదా ఐస్ క్రీమ్స్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. సవాళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత వారిపై అత్యాచారానికి ఒడిగట్టి అంతటితో ఆగని ఆ కామాంధుడు ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసేవాడు.

బెడ్డు పక్కనే ఒక అలారం క్లాక్ లో ఒక కెమెరాను అమర్చి ఎందుకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేశాడు. ఇక భలేష్ పై లైంగిక ఆరోపణలు రాగా 2018లో పోలీసులు అతన్ని అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించగా అప్పుడు పదుల సంఖ్యలో వీడియోలు దొరికాయి. ఆ వీడియోలను కొందరు యువతులు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫోల్డర్లకు కొరియన్ మహిళల పేర్లు కూడా పెట్టాడు. అతని కేసును విచారించిన సిడ్నీ డౌనింగ్ సెంటర్ కోర్టు, తాజాగా భలేష్ ని అత్యాచార కేసులో దోషిగా తేల్చేసింది. సిడ్ని చరిత్రలోనే నీచమైన రేపిస్టుగా అక్కడి మీడియా సంస్థలు భలేష్ ని అభివర్ణించాయి. ఈ కేసులో చట్టపరమైన ఖర్చులకోసం బలిసి తన కుటుంబ ఆస్తులు అన్నింటిని అమ్ముకొని రోడ్డు మీద పడ్డాడు. ఈ ఏడాది చివర్లో అతనికి శిక్షణ ఖరారు చేయనున్నారు.