Site icon HashtagU Telugu

Viral : స్టేషన్ కు వచ్చిన మహిళపై పోలీసు అసభ్యకర ప్రవర్తన

Madhugiri Ps

Madhugiri Ps

ఇటీవల పలువురు పోలీసులు..స్టేషన్ (Police Station) కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల(Woman )తో అసభ్యంగా ప్రవరిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. కర్ణాటక(Karnataka )లోని మధుగిరి(Madhugiri ) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పట్ల ఓ పోలీసు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మహిళకు సహాయం చేసే బదులుగా, ఆమెను గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడంతో ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. మరోపక్క ప్రజలు సైతం దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు భద్రంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడే ఇలాంటి అవమానాలు ఎదురవుతుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మహిళలపై హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సదరు పోలీసును విధుల నుంచి తొలగించి విచారణ నడుస్తోందని సమాచారం.

Game Changer : ఐమ్యాక్స్ లో ‘గేమ్ ఛేంజర్’..మెగా ఎక్స్ పీరియన్స్ మాములుగా ఉండదు మరి ..!!
ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు తెరపైకి తెచ్చింది. పోలీస్ స్టేషన్‌లలో కూడా మహిళలకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. న్యాయం కోరేందుకు వచ్చిన మహిళలపై ఇలాంటి ప్రవర్తన జరిగితే, బాధితులు న్యాయసాయం పొందడం కష్టసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే స్వచ్చంద సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు మార్పు చెందాల్సిన అవసరముందని డిమాండ్ చేశాయి.