Heavy Rains: వీడియో వైరల్.. వరదలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన వ్యక్తి?

నైరుతి రుతుపవనాల దెబ్బకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో చాలా ప్రదేశాలు న

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 03:58 PM IST

నైరుతి రుతుపవనాల దెబ్బకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో చాలా ప్రదేశాలు నీటి మునిగిపోవడంతో పాటు ఎక్కడ చూసినా కూడా వరద నీరు చేరాయి. ముఖ్యంగా ఇప్పటికే అస్సాం వరదలో చిక్కుకుపోయింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లి తదితర రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అస్సాంలో ఇప్పటికీ వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. తొమ్మిది జిల్లాల్లో దాదాపు 4 లక్షలకు పైగా ప్రజలు భారీ వర్షాలతో ప్రభావితం అయ్యారు.

ఒకవైపు వరదలు ముంచేత్తుతుండగా మరొకవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు గుప్పెట్లో ప్రాణాలను పెట్టుకొని గుప్పు గుప్పు మంటూ బతుకుతున్నారు. వర్షాల కారణంగా తాజా ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక యువతి విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకుంటున్న ఆమె ధ్యలో నీటి గుంటలను దాటే క్రమంలో ఒక విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకోవడంతో కరెంట్‌ షాక్‌కు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే హరియాణాలో వంతెన కింద వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న కారులోంచి మహిళను సురక్షితంగా కాపాడారు.

 

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పది మంది దాకా తాడు సహాయంతో మహిళను అతి కష్టంగా మహిళను సురక్షితంగా కాపాడగలిగారు. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ వరదల కారణంగా దాదాపు ఇప్పటికే వందల గ్రామాలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 101 సహాయక శిబిరాల్లో 81 వేలకుపైగా వరద బాధితులు తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించామని, అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.